తెలుగు సినిమా పరిశ్రమలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి తరువాత అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి, దాదాపుగా కొన్నేళ్ల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, మెగా స్టార్డంతో కొన్నేళ్లపాటు అగ్ర హీరోగా కొనసాగడం జరిగింది. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిన చిరంజీవి గారు, 2008లో ప్రజారాజ్యం పేరుతో పార్టీని నెలకొల్పి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం జరిగింది. 2007లో మెగాస్టార్ నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా అప్పట్లో ఆయనకు కెరీర్ పరంగా ఆఖరు సినిమా. అయితే ఆ తరువాత దాదాపుగా పదేళ్లు రాజకీయాల్లో కొనసాగిన మెగాస్టార్, ఇటీవల 150వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ ని సాధించి, ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇక ప్రస్తుతం 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్. 

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక మరోవైపు సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 152 వ సినిమాని కూడా త్వరలో మొదలెట్టబోతున్నారు. ఆ సినిమా కోసం మెగాస్టార్ కొద్దిరోజులుగా తన శరీర బరువును చాలావరకు తగ్గించుకుని స్లిమ్ గా తయారయ్యారు. ఇకపోతే మూడు రోజుల క్రితం, బి పాజిటివ్ అనే జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్, తన సినిమా మరియు రాజకీయ జీవిత అనుభవాలు పంచుకున్నారు. ఎంత రాజకీయాల్లో ఉన్నప్పటికీ నాకు సినిమా అనేది ఎప్పటికే గుర్హ్తుకువస్తూనే ఉంటుంది. ఎందుకంటే, ఒక నటుడిగా ప్రేక్షకులు తమ గుండెల్లో నాకిచ్చిన స్థానాన్ని నేను  మరిచిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత, గడచిన ఈ పదేళ్లలో టాలీవుడ్ ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకుందని, అలానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటివారు అద్భుతమైన సినిమాల్లో నటించి పరిశ్రమను మరింత ముందుకు దూసుకెళ్లారని, మరి అటువంటి పరిస్థితుల్లో నేను చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా, ఎలా ఆడుతుందా అని మనసులో కొంత భయం ఉండేదని అన్నారు. 

అయితే ప్రేక్షకులు మాత్రం ఊహించని విధంగా, ఇంకా తనపై అదే అభిమానాన్ని చూపిస్తూ ఆ సినిమాకు అతి పెద్ద విజయాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం మంచి జోష్ తో మూవీస్ చేస్తూ ముందుకు సాగడం కూడా ఎంతో హ్యాపీగా ఉందని, అయితే రంగస్థలం సినిమాని సెలెక్ట్ చేసుకుని, చిట్టిబాబు పాత్రలో జీవించాడని, నిజానికి ఆ సినిమా కథ మరియు కథనాలు బాగున్నప్పటికీ, చిట్టిబాబు పాత్రలో వేరియేషన్స్ పండించడం అంత సులువు కాదని, కానీ చరణ్ మాత్రం ఆ క్యారెక్టర్ కి జీవిం పోయడం వలన తనకు అవార్డ్స్ కూడా వస్తున్నాయన్నారు. అయితే అదే పాత్ర చేయమని తనని అడిగితే, తాను మాత్రం కుదరదని చెప్పేసేవాడిని అని అన్నారు. ఇక మెగాస్టార్ ఇచ్చిన ఆ లేటెస్ట్ ఇంటర్వ్యూ, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: