అడ‌వి శేష్ హీరోగా రెజీనా క‌సాండ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఎవరు’ ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 15న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది.  వెంక‌ట్ రామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది ఈ సంద‌ర్భంగా ఆ చిత్ర విశేషాల‌ను మీడియాతో ముచ్చ‌టించారు.


స‌క్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు...
సినిమా 20 % షూట్ బ్యాలెన్స్ ఉండగానే డిసెంబర్ లో నేను మూవీ మొత్తం చూశాను. అప్పుడే సినిమా సూపర్ హిట్ అవ్వబోతుందని మేం డిసైడ్ అయిపోయాము. అయితే ఈ సినిమా నేను ‘ఏ’ సెంటర్స్ లో మాత్రమే హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ, మాస్ సెంటర్స్ లో వస్తోన్న ఆదరణ చూస్తుంటే.. నిజంగా షాక్ గా అనిపించింది. ఓవరాల్ గా ‘ఎవరు’ సక్సెస్ బాగా సంతృప్తిని ఇచ్చింది. నేనైనా, శేష్ అయినా అమెరికా నుండి చదువుకుని వచ్చాం. అందుకే మాకు మాస్ పల్స్ తెలియవని పీవీపీగారు తిడుతుంటారు. కానీ సినిమా నా అంచనాలను మించి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. సింగిల్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. విక్రమ్‌ క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి పిచ్చ కిక్ వచ్చింది. అందుకే ముందుగానే ప్రివ్యూస్ వేశాం.


 స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేశారు ...
సినిమాలో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నేను ఈ సినిమా స్క్రిప్ట్ లో ఫాలో అయింది అదే.ది ఇన్విజబుల్ గెస్ట్` పాయింట్‌ని పీవీపీగారు చెప్పగానే కనెక్ట్ అయ్యాను. నేను ఆ సమయంలో సినిమాను థ్రిల్లర్‌లా కాకుండా రివేంజ్ స్టోరీలా చూశాను. న్యాయం కోసం పోరాడే యువకుడి కథే ఇది. దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం వల్ల థ్రిల్లర్‌లా అనిపించింది. ఓరిజినల్ సినిమా `ది ఇన్విజబుల్ గెస్ట్‌`ను ఎప్పుడో నార్మల్‌గా చూసేశాను. నాకు ఓకే అనిపించింది. అదే పాయింట్‌ను పీవీపీగారు చెప్పారు. బాగానే ఉందని అనుకున్నాను. అప్పుడు అసలు సినిమా గురించి చెప్పారు. తర్వాత మరోసారి నేను ఆ సినిమాను చూశాను.


రెజీనా క్యారెక్టర్ లో షేడ్స్ చాలా ఉన్నాయి త‌న న‌ట‌న గురించి...
అవును, రెజీనా కళ్ళు భావోద్వేగాలను బాగా పలికించగలవు. అందుకే సినిమాలో నేను ఎక్కువుగా క్లోజ్ షాట్స్ పెట్టడానికి కారణం రెజీనానే. కథ చెబుతున్నప్పుడే ఆమె కథలోని తన క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అచ్చం సమీరాలానే ఆమె చాలా బాగా చేసింది. ఆమె దాదాపు 7-8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఆమెకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు. తను చాలా సినిమాలు చేశాయి. `అ!` నుండి తన పంథా మార్చుకుంది. ఇకపై కెరీర్‌లో ఏ సినిమా చేసినా ఓ గట్ ఫీలింగ్‌తో చేస్తుందని నేను నమ్ముతున్నాను. తను ఎక్స్‌ప్రెసివ్.. సెటిల్డ్‌గా నటిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. తను క్యారెక్టర్‌లోని లేయర్స్ పరంగా అద్భుతంగా నటించింది.


సినిమాలో మిగ‌తా ఆర్టిస్టుల గురించి...
రెజీనా అండ్ మురళిశర్మగారు క్యారెక్టర్స్ అలాగే మిగిలిన యాక్టర్స్ లో విషయంలో కూడా ముందు నుంచీ మేం వాళ్లనే పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాము.  నవీన్ చంద్రని నేను హీరోగానే చూశాను. తను సోలోగా హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో మా సినిమాలో నటిస్తాడని నేను నమ్మలేదు. `అరవిందసమేత` చూసిన తర్వాత తనకి కథ వినమని మెసేజ్ పెట్టాను. తను విని చేస్తానని చెప్పాడు. ఆదిత్య వర్మ పాత్ర కోసం మేం ముగ్గురు చిన్న అబ్బాయిలను తీసుకోవాలని అనుకున్నాం. అందులో నిహాల్‌ని చూడగానే తనలో ఇన్నోసెన్స్ బాగా నచ్చేసింది. ముగ్గురుని లుక్ చేసి నిహాల్‌ని ఎంపిక చేసుకున్నాం.


అడవి శేష్ కూడా రైటర్ కదా.. స్క్రిప్ట్ లో ఎలా హెల్ప్ అయ్యారు ...
శేష్ ని అందరూ రైటర్ అని అంటుంటారు గాని, తను స్క్రిప్ట్ లో ఎక్కువుగా ఇన్ వాల్వ్ అయ్యేదాని కంటే.. స్క్రిప్ట్ ఎలా ఉంది ? స్క్రిప్ట్ లో ఐడియాలు ఏం బాగున్నాయి అని మాత్రామే చెప్పగలడు. తను పేపర్ మీద రాసే రైటర్ కాదు, కానీ తను ఇచ్చే కొన్ని సలహాలు బాగుంటాయి. అలాగే అబ్బూరి రవిగారు కూడా.. ముఖ్యంగా అబ్బూరిగారు ‘ఎవరు’ క్లైమాక్స్ విషయంలో చాలా బాగా హెల్ప్ చేశారు. కథకు స్టోరీ పరంగా శేష్, అబ్బూరిరవిగారు హెల్ప్ అయ్యారు. ఇంటర్వెల్ సమయంలో అబ్బూరి రవిగారు చూసి ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా బావుండాలని అన్నారు. నేను మళ్లీ మార్చి రాసుకున్నాను. ఈ సినిమా పరంగా శేష్, అబ్బూరి రవిగారు తొలి ప్రేక్షకులుగా భావిస్తున్నాను. వారి సలహాల ప్రకారం మార్పులు, చేర్పులు చేశాను.


సినిమాలో డైలాగ్ లు చాల బాగున్నాయి ...
అబ్బూరి రవిగారే అలా రాశారు. ఆయనకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడే.. నా సినిమాలో ఫైట్స్ లాంటివి లేవు, సినిమాలో ప్రతి డైలాగ్ పేలాలి అని చెప్పాను. ఆయన చాలా బాగా రాశారు.


మీ తదుపరి ప్రాజెక్ట్స్ గురించి...
ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే పీవీపీగారి వల్లే. ఆయన బ్యానర్ లోనే నా తదుపరి ఫిల్మ్ ఉంటుంది. నేను మొదట చెప్పాలనుకున్న కథను నా రెండో సినిమాగా చెయ్యాలనే ఆలోచన ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: