డిస్ని సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.  వాటిలో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి.  అయితే, డిస్ని సినిమాలు అంటే.. దాదాపుగా యానిమేషన్ సినిమాలు ఉంటాయి.  యానిమేషన్ సినిమాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  


డిస్ని నుంచి వచ్చిన యానిమేషన్ సినిమాలు ఇప్పుడు వరసగా బిలియన్ డాలర్లు వసూలు చేసింది.  అల్లాదీన్, ది లయన్ కింగ్ సినిమాలు బిలియన్ డాలర్లు వసూలు చేశాయి.  ఈ రెండు సినిమాలు గతంలో వచ్చాయి.  పాతతరం తీసిన సినిమాలను కొత్తగా తిరిగి తెరపై చూపించారు.  ఇలా చూపించడం గ్రేట్ అని చెప్పాలి. 

ఈ సినిమాలు రెండు మరలా హిట్ హిట్ కావడంతో.. డిస్ని ఇలాంటి సినిమాలపైనే నమ్మకం పెరిగింది.  అదే టాయ్స్ 4.  ఈ సిరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి.  ఇటీవలే నాలుగో సినిమా టాయ్స్ 4 కూడా వచ్చింది.  ఇది కూడా మంచి వసూళ్లు రాబడుతున్నది.   ఈ మూడు మంచి విజయాలు సాధించినా భారీ స్థాయిలో విజయాలు లేవు.  కానీ, అల్లాదీన్, ది లయన్ కింగ్ సినిమాలు బెస్ట్ హిట్ కొట్టడంతో ఈ సినిమా కూడా అదే విధంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్నది.  


ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  కేవలం డిస్ని సినిమాలే కాదు.. మార్వెల్ నుంచి వచ్చిన ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ కూడా బిలియన్ డాలర్లు పైగా వసూలు చేసింది.  ఇదే ఏడాది ఫ్రోజెన్ 2, స్టార్‌వార్స్‌: ది రైజ్‌ ఆఫ్‌ స్కైవాకర్‌’ సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉన్నది. ఈ సినిమాలు కూడా ఇదే రేంజ్ లో హిట్ అవుతాయని ఆశిద్దాం.  ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఆదరణ పెరగడం కూడా ఈ సినిమాలు ఉపయోగపడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: