టాలీవుడ్ లో బాహుబలి లాంటి మూవీతో కొత్త చరిత్ర సృష్టించిన దర్శకులు రాజమౌళి.  అప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్ లకు మాత్రమే జాతీయ స్థాయిలో రికార్డులు ఉండేవి.. కానీ రాజమౌళి ఆ రికార్డులు బ్రేక్ చేస్తూ జాతీయ స్థాయిలో సెన్సేషన్ సృష్టించారు.  యంగ్ రెబల్ స్టార్ కి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో చత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన రాజమౌళి తర్వాత  బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా అందించారు.  వీరిద్దరి జర్నీ ఎంతో కాలం నడిచింది.  ఒకదశలో రాజమౌళి కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు తన సమయాన్ని కేటాయించారు. 

అప్పటి వరకు తనకు ఎన్ని సినిమాల ఛాన్సులు వచ్చిన అవన్నీ పక్కన బెట్టి కేవలం రాజమౌళి కోసమే తన సమయాన్ని వెచ్చించి ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారు. అందుకే ప్రభాస్-రాజమౌళికి ఎంతో అనుబంధం ఉంది.  తాజాగా సాహో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి ‘సాహూ’మూవీ గురించి మాట్లాడారు.  బాహుబలి తర్వాత ప్రభాస్ కథను నమ్మి సాహో మూవీ చేయడం తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు.

బాహుబలి తర్వాత కేవలం పెద్ద దర్శకులకు మాత్రమే తన ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ తన సమయాన్ని వెచ్చించడం అంటే ఎంతో గొప్పవిషయం అన్నారు. కథపై నమ్మకంతో సుజీత్ దర్శకత్వంలో నటించడం ప్రభాస్ కే చెల్లిందని అన్నారు. బాహుబలి తర్వాత తన అభిమానులు ఇలాంటి కథనే ఇష్టపడతారని ప్రభాస్ భావించాడని, ధైర్యంగా ముందడుగు వేశాడని రాజమౌళి వివరించారు. 

ప్రభాస్ ని ఎలా చూడాలని అభిమానులు అనుకుంటున్నారో ఈ మూవీలో అలా కనిపిస్తాడని ఈ మూవీతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోతుందని గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు. సాహో స్పాన్ చూసిన తర్వాత ఇంత పెద్ద కథను సుజీత్ డీల్ చేయగలడా అని చాలామంది సందేహించినా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యాయని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: