మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు 'సైరా' ని. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. యుద్ధ వీరుడు ఉయ్యాల నర్సింహ రెడ్డి జీవిత కథతో సినిమా చేయాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న చిరు కోరిక మొత్తానికి ఇన్నాళ్ళకు తీరింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు చిత్ర బృందం.

అయితే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను, అసలు ఈ సినిమా మొదలయ్యే ముందు జరిగిన విషయాల గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు మెగా స్టార్. 'శంకర్ దాదా  M.B.B.S'చేస్తున్నప్పుడే ఉయ్యాల వాడ నర్సింహ రెడ్డి కథతో సినిమా చేయలనుకున్నానని.. కానీ ఆ సమయంలో బడ్జెట్ కారణంగా వెనకడుగు వేశామని తెలిపారు చిరు.  అందుకే తమిళంలో మంచి కమర్షియల్ సక్సస్ అయిన 'కత్తి' రీమేక్ చేయాలని ఆ సినిమాను ఎంచుకున్నట్టు తెలిపారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. 

అంతేకాదు 150వ సినిమాగా అదే కథతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని కానీ, రీ ఎంట్రీ అలాంటి కథతో కాకుండా కమర్షియల్ అంశాలతో ఓ సందేశాత్మక సినిమా అయితే బెటరని ఖైదీ 150 చేశానని చెప్పారు. ఆ సినిమాతో వచ్చిన రెస్పాన్స్ బట్టి ఉయ్యాలవాడ కథ చేయాలని డిసైడయ్యి ఎట్టకేలకు 151 సినిమాగా సైరా చేశానని మెగాస్టార్ ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్న, నిహారిక ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: