విక్టరీ వెంటేశ్ ఇప్పుడు బాగా సినిమాలు తగ్గించుకున్నాడు.. సెలెక్టివ్ గా చేస్తున్నాడు. ఇటీవలే ఎఫ్ 2 మూవీతో బంపర్ హిట్ కొట్టేసాడు.. ఇప్పుడు మళ్లీ వెంకీమామ అంటూ మల్టీ స్టారర్ తో ముందుకురాబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ఆయన ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్.


అదేంటంటే.. 'వెంకీ మామ' చిత్రంలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా వెంకటేష్‌ గాయపడ్డారు. ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో వెంకటేశ్ కాలు బెణికిందట. ఈ విషయం తెలియగానే షూటింగ్ ఆపేసి వెంకటేశ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారట. అయితే పెద్దగా భయపడాల్సిందేమీ లేదని వైద్యులు చెబుతున్నట్టు తెలిసింది.


బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్నఈ చిత్రంలో వెంకటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లపై ఓ గీతాన్ని షూట్ చేస్తున్నారు అందులో భాగంగా డాన్స్ చేస్తున్న వెంకీ కాలు బెణికిందట.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. వెంకీ కాలిగాయాన్ని పరీక్షించిన డాక్టర్స్.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నట్టు తెలుస్తోంది. కాలి మడిమకు దెబ్బ తగిలింది. కొన్నిరోజులు రన్నింగ్, ఫైటింగ్ వద్దని డాక్టర్లు చెప్పారట.


మరి వెంకటేశ్ గాయంతో 'వెంకీ మామ' షూటింగ్‌కి కొనసాగుతుందా.. లేదా కొద్దిగా గ్యాప్ వస్తుందా అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదల కావాలి. వెంకటేష్ కాలి గాయంతో.. వెంకీ మామ విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇక 'వెంకీ మామ'లో వెంకటేష్, నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఎఫ్ టూ తరహాలోనే ఈ వెంకీ మామ కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: