‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అతిధులు ప్రభాస్ తో సమానంగా దర్శకుడు సుజిత్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇలాంటి భారీ సినిమా తీసే అదృష్టం సుజిత్ కు లభించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ ఫంక్షన్ లో మాట్లాడిన సుజిత్ ప్రభాస్ తో ఇలాంటి సినిమాను చేయడానికి తనకు కలిగిన అదృష్టం పై పొంగిపోతూ తాను గతంలో ప్రభాస్ పిలుపుకు స్పందించి అతడిని కలవడానికి ఇష్టపడని ఆసక్తికర సంఘటనను వివరించాడు.

సుజిత్ షార్ట్ ఫిలిమ్స్ చేసే రోజులలో అతడు చేసిన ఒక షార్ట్ ఫిలిం చూసి ప్రభాస్ అతడిని ఒకసారి తన వద్దకు రమ్మని చెప్పాడట. అయితే ఈ విషయానికి సంబంధించిన ఫోన్ సుజిత్ అప్పట్లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా చూస్తున్నప్పుడు తనకు ఫోన్ వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అయితే తన లాంటి వ్యక్తిని ప్రభాస్ కలవడం ఏమిటి అన్న సందేహంతో తాను ప్రభాస్ ను కలవడానికి ఇష్టపడలేదనీ అయితే ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి తాను యూవీ క్రియేషన్స్ కోసం ‘రన్ రాజా రన్’ సినిమా తీస్తున్నప్పుడు ప్రభాస్ తనను పిలిపించుకుని తాను పిలిచినా ఎందుకు రాలేదు అంటూ నవ్వుతు ప్రశ్నించిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో ప్రభాస్ జ్ఞాపక శక్తి గురించి సుజిత్ ఒక ఆశ్చర్యకర విషయం షేర్ చేసాడు.

‘ప్రభాస్ 100 బీబి హార్డ్ డిస్క్’ లాంటి వాడని ఎవరు ఎప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడినా అన్నీ ప్రభాస్ మైండ్ లో ఉంటాయని చెపుతూ ‘సాహో’ మేకింగ్ లో జరిగిన ఒక విషయాన్ని సుజిత్ వివరించాడు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రభాస్ కు ‘సాహో’ కథ చెపుతున్నప్పుడు ఒక సీన్ లో ప్రభాస్ ఎలా నటించాలో తాను అప్పట్లో వివరించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే అదే సీన్ తాను ‘సాహో’ లో చిత్రీకరిస్తున్నప్పుడు ప్రభాస్ ఈ సన్నివేశం ఇలా తీయకూడదు కదా అంటూ తాను అప్పట్లో చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసినప్పుడు ప్రభాస్ ఒక టాప్ హీరోగా కాకుండా తనకు ఒక ‘సూపర్ కంప్యూటర్’ గా కనిపించాడు అంటూ సుజిత్ చేసిన ప్రశంసలు నిన్నటి కార్యక్రమంలో హైలెట్..


మరింత సమాచారం తెలుసుకోండి: