తెలుగు సినిమా బడ్డెట్ అంటే.. ఒకప్పుడు 25 కోట్లు ఖర్చు చేస్తే చాలా ఎక్కువ. ఆ తర్వాత ఆ రేంజ్ 50 కోట్లు చేరింది. అది కూడా చాలా రిస్క్ గా అనిపించేది.. కానీ ఈ సీన్ ను తిరగరాశాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ఏకంగా వందల కోట్లకు తెలుగు సినిమా బడ్జెట్ ను చేర్చాడు.

రాజమౌళి వేసిన బాటను ఇప్పుడు సుజీత్ మరింత విస్తృతం చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలో ఈ ప్రత్యేకత సాధించాడు. ఇదే విషయాన్ని చెప్పారు.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆయన ఏమన్నారంటే..

‘‘మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌’ కంటే డబుల్‌ బడ్జెట్‌తో ‘మిర్చి’ సినిమా తీశారు. ఎందుకింత ఖర్చు పెడుతున్నారని వంశీ, ప్రమోద్‌లను అడిగాను. ‘మా ప్రభాస్‌ కోసం కదా.. పెట్టేశాం’ అన్నారు. ఆ సినిమా చాలా పెద్ద విజయం అందుకుంది. ప్రభాస్‌ డేట్లు ఇస్తే డబ్బులు సంపాదించాలని చూస్తారు. కానీ ‘బాహుబలి 2’ కంటే ఎక్కువ బడ్జెట్‌ పెట్టి ‘సాహో’ తీశారు.


ఇంత బడ్జెట్‌ పెట్టారేంటి? అని అడిగితే, ఇప్పుడు కూడా ‘ప్రభాస్‌ కోసం కదా’ అన్నారు. నన్ను చూసి నిర్మాతలం అయ్యామని వాళ్లిద్దరూ చెబుతుంటారు. కానీ వాళ్లని చూసి ఓ సినిమాని దేశ వ్యాప్తంగా చూసేలా ఎలా తీయాలో నేర్చుకున్నా. సుజీత్‌ అదృష్టవంతుడు. పాన్‌ ఇండియా సినిమా తీయడానికి రాజమౌళిగారికి 15 ఏళ్లు పట్టింది రెండో సినిమాకే సుజిత్‌ ఆ ఘనత దక్కించుకున్నాడు.


నేను చాలామంది స్టార్‌ హీరోల్ని చూశాను. కానీ ప్రభాస్‌ దగ్గరకు వెళ్తే.. ఓ హీరో దగ్గరకు వెళ్తున్నట్టు కాదు, ఓ స్నేహితుడి దగ్గరకు వెళ్తున్నట్టు ఉంటుంది. ‘బాహుబలి’లా ఈ సినిమా కూడా పెద్ద విజయం అందుకోవాలి. తెలుగువాళ్లంతా గర్వపడాలి అన్నారు దిల్ రాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: