మల్లికా షెరావత్ ఈ  పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె బోల్డ్ గా నటించిన సినిమాలే. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా ఆమెని చూడడానికే సినిమాకి వెళ్ళే వారంతే అతిశయోక్తి కాదేమో! ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ, మల్లికా కాంబినేషన్ అంటే ముద్దు సీన్లకి పెట్టింది పేరు. మర్డర్ సినిమాలో వీరిద్దరి సీన్లకి కుర్రకారు వెర్రెత్తిపోయారు. అయితే గత కొంత కాలంగా మల్లికా షెరావత్ సినిమాల్లో కనిపించడం లేదు. సన్నీ లియోని వచ్చిన తర్వాత ఆమెని పెద్దగా పట్టించుకోవట్లేదనే చెప్పాలి.


బాలీవుడ్ లో స్కిన్ షో చేసిన మల్లికా షెరావత్ తనకున్న క్రేజ్ తో "జాకీఛాన్" ది మిత్ అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.మల్లికా సినిమా అంటే స్కిన్ షో తప్పని సరి అయిపోయింది. ఈమె చేసిన సినిమాల వల్ల బాలీవుడ్ నాశనం అయిందంటూ విమర్శలు కూడా ఎదుర్కొంది.


గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించకుండా పోయిన మల్లికా బాలీవుడ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కొన్ని సినిమాల్లో న్యూడ్ గా కూడా కనిపించిన మల్లికా అందాల ఆరబోత గురించి ఈ విధంగా చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో న్యూడ్ గా నటించడం పెద్ద విషయం కాదని, ముదు సీన్లు, బికినీలు కామన్ అయిపోయాయని, కథకి కావాల్సి వస్తే నగ్నంగా కూడా నటిస్తున్నారని చెప్పింది.


పైగా అలాంటి వారికి ఇప్పుడు విమర్శలు కూడా రావట్లేదని, ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని మరికొద్ది రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని తెలిపింది. ప్రేక్షకులు కూడా అలాంటి వారిని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని అప్పట్లో ఇంత ఆక్సెప్టెన్సీ లేదని తెలిపింది.





మరింత సమాచారం తెలుసుకోండి: