రాజమౌళి ప్రభాస్ ల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ నిన్న ‘సాహో’ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగంతో ప్రభాస్ కంట కన్నీరు రావడం మీడియా కెమెరాలకు హాట్ న్యూస్ గా మారింది. రాజమౌళి ప్రభాస్ మంచితనం గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఏనాడు ఏ హీరో గురించి నెగిటివ్ గా కామెంట్ చేసిన సందర్భాలు లేవు అంటూ ప్రశంసలు కురిపించాడు. 

అందుకే ప్రభాస్ ను అందరి హీరోల అభిమానులు ఇష్టపడతారని ప్రభాస్ కు వ్యతిరేకంగా ఇండస్ట్రీలోని ఏ ఒక్క హీరో మాత్రమే కాకుండా టాప్ హీరోల అభిమానులు కూడ ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేయరు అంటూ కామెంట్స్ చేసాడు. రాజమౌళి నోటి వెంట ఈ ప్రశంసలు వస్తున్నప్పుడు ప్రభాస్ ఉద్వేగంతో తన కంట వస్తున్న కన్నీరును ఆపుకోలేక పోవడం స్పష్టంగా కనిపించింది. 

ఇదే సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ ‘బాహుబలి’ లాంటి సూపర్ సక్సస్ అందుకున్న తరువాత ప్రభాస్ లాంటి హీరో తన తదుపరి సినిమాను ఎవరైనా టాప్ దర్శకుడుతో చేయాలని ప్రయత్నిస్తారని అయితే ‘బాహుబలి’ విడుదలకు ముందే సుజిత్ కు ఇచ్చిన మాట పై నిలబడి సుజిత్ ను నమ్మి సినిమా చేయడం అతడి మంచితనాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక సుజిత్ గురించి మాట్లాడుతూ పది సినిమాలు తీసిన ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ లా సుజిత్ మేకింగ్ స్టైల్ తనను ఆశ్చర్య పరిచింది అంటూ సుజిత్ పై ప్రశంసలు కురిపించాడు. 

‘సాహో’ ట్రైలర్ పై రాజమౌళి స్పందించక పోవడంతో ప్రభాస్ రాజమౌళిల మధ్య గ్యాప్ ఏర్పడిందా అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాలకు సమాధానంగా రాజమౌళి ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసించడం ఆ ప్రశంసలకు ప్రభాస్ పొంగిపోయి కంట కన్నీరు పెట్టిన దృశ్యాలను చూసిన వారికి మాత్రం ప్రభాస్ రాజమౌళిల సాన్నిహిత్యం విడదీయగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని అనిపిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: