వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. వర్మ ఏం చేసినా అది వివాదమే అవుతుంది. అలా చేయడానికే అతను ఇష్టపడతానని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అయితే నిజ జీవిత కథలకి కొంత తన కల్పన జోడించి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ మరోమారు బయోపిక్ పైన పడ్డాడు. అయితే దీన్ని బయోపిక్ అని చెప్పలేం. కానీ అలాంటిదే. వాస్తవిక కథల్ని తెరపైన అద్భుతంగా తెరెకెక్కించగల సమర్థులలో రామ్ గోపాల్ వర్మ మొదటి వాడు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత తన తర్వాతి సినిమాని ప్రకటించాడు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలు చెతిలో పెట్టుకునే వర్మ ఏ సినిమా ఏప్పుడు చేస్తాడో అతనికి కూడా తెలియదు. అయితే "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమా తీస్తానని అనౌన్స్ చేసిన వర్మ ఆ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు మొదలెట్టేశాడని తెలుస్తుంది.  స్క్రిప్ట్ పనులు నడుస్తుండగా ఆ సినిమాలో నటించే వారి అన్వేషణలో పడ్డాడట.


నిజ జీవితంలోని క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్న మూలంగా ఆ క్యారెక్టర్ల పోలికలకి దగ్గరగా ఉన్న వారి కోసం వెతుకుతున్నాడు. అయితే ఆ డూప్ ఎవరెవరు కావాలో కూడా చెప్పేసాడు. ప్రధాని మోదీ, అమిత్ షా, నారా చంద్రబాబు, వై యస్ జగన్మోహన్ రెడ్డి, నారా బ్రాహ్మణి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్పీకర్ తమ్మినేని సీతారాం, నారా లోకేష్, అచ్చన్న నాయుడు, నారా దేవాన్ష్, కేశినాని నాని,కోడెల శివ ప్రసాదరావు, ఘంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి, పోలిస్ అధికారి గౌతమ్, దేవినేని ఉమా మహేశ్వర్ రావుల కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు.


అయితే ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉన్న కారణంగా వీళ్ళంతా దొరకడానికి చాలా టైం పడుతుంది. అయితే వీరంతా ఎప్పుడు దొరుకుతారో తెలియదు. వీరంతా దొరికి సినిమా పూర్తవడానికి చాలా టైం పడుతుందని, అప్పటి వరకు వర్మ మళ్ళీ ఇంకో సినిమాని ప్రకటించేసి, ఆ సినిమాలోకి వెళ్ళిపోతాడని అభిప్రాయ పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: