కొంతకాలం చిరంజీవితో గ్యాప్ కొనసాగించిన పవన్ కళ్యాణ్ ఇప్పడు చిరంజీవితో అదే విధంగా మెగా కాంపౌండ్ తో  చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మెగా అభిమానులు చిరంజీవికి గతంలో నిర్వహించిన షష్టిపూర్తి వేడుకలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పడు ఈనెల 22న మెగా అభిమానుల‌ పండుగ రోజుగా జరుపుకునే మెగా స్టార్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనబోతున్నాడు.

ఈ వేడుక‌ల హంగామాప్రతి ఏడాది పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు.  ప్రతి ఏటా ఈ హంగామా పెరుగుతూనే ఉంది. చిరంజీవి రాజకీయాలు విడిచి పెట్టి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్నప్పటి నుంచి ఈ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యామిలీ చాల పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నెల 21న చిరంజీవి పుట్టినరోజుకు ఒకరోజు ముందు హైదరాబాద్ శిల్పకళా మందిరంలో మెగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫంక్షన్ కు అతిధిగా రావడానికి పవన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ ఫంక్షన్ కు మెగా యంగ్ హీరోలు అందరికీ ఆహ్వానాలు వెళ్ళినట్లు టాక్. 

అయితే ఈ ఫంక్షన్ కు చిరంజీవి హాజరు అవ్వడం లేదు అని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఈ సారి పుట్టినరోజుకు ఒక హాలిడే స్పాట్ కు వెళతాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పవన్ చిరంజీవిలను మెగా స్టార్ పుట్టినరోజు వేడుకలలో ఒకే వేదిక పై కలిసి చూడాలి అని ఆశిస్తున్న మెగా అభిమానుల కోరిక తీరికపోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో మరొక వ్యూహం ఉంది అని కూడ అంటున్నారు. పవన్ ఎన్నికలలో ఓడిన నేపధ్యంలో పవన్ వెంట టోటల్ మెగా ఫ్యామిలీ అదేవిధంగా టోటల్ మెగా అభిమానులు బాసటగా నిలబడ్డారు అన్న సంకేతాలు ఇవ్వడానికి చిరంజీవి ఈ ఫంక్షన్ కు రాకుండా పవన్ ను ఎలివేట్ చేస్తున్నాడు అన్న మాటలు కూడ ఉన్నాయి. అయితే ఈ విషయాల పై క్లారిటీ ఎల్లుండి తెలిసే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: