కమలం పార్టీ దేశంలో దూసుకుపోతున్నది.  వరస విజయాలు సాధిస్తూ దేశంలో రోజు రోజుకు పాపులర్ అవుతున్నది.  నార్త్ లో బలంగా ఉన్న ఈ పార్టీ, ఇప్పుడు సౌత్ లో కూడా బలపడేందుకు సిద్ధం అయ్యింది. తెలంగాణాలో పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉన్నది.  గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని స్ట్రాంగ్ అయ్యేందుకు బాటలు వేసుకుంటోంది.  కాగా, అటు ఏపి లోను బలపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.  తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు  300 మందికి పైగా నేతలు నిన్న బీజేపీలో జాయిన్ అయ్యారు.  


ఇంకా కొంతమంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు.  సెప్టెంబర్ 17 వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు.  ఆయన ఆధ్వర్యంలో కొంతమంది బడానేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహిస్తూనే.. అటు తమిళనాడులో కూడా కమలం ఆకర్ష్ ను ప్రారంభించింది.  ఇందులో భాగంగా రజినీకాంత్ ను తమ పార్టీలోకి తీసుకోవడానికి పధకాలు వేస్తోంది.  


జాతీయ నేతలు రజినీకాంత్ తో నిత్యం టచ్ లో ఉంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో రాజీకాంత్ పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.  అయితే, రజినీకాంత్ సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే.. బీజేపీలో ఉండి పోటీ చేస్తారా అన్నది తెలియాలి. పార్టీ పెట్టె విషయంపై రజినీకాంత్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.  దీనిపై మీడియా ప్రశ్నిస్తే.. పార్టీ పెడితే చెప్పకుండా ఎలా ఉంటానని రజినీకాంత్ అంటున్నారు.  


అయితే, రజినీకాంత్ ను బీజేపీ పార్టీలోకి తీసుకుంటే.. బీజేపీ బలపడుతుందని, రజినీకాంత్ ను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.  ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది తెలియాల్సి ఉన్నది.  2021లో జరిగే ఎన్నికల్లో రజినీకాంత్ తప్పనిసరిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు.  అందులో సందేహం అవసరం లేదు.  సొంతంగా పార్టీ పెడతారో లేదా కమలం గూటికి చేరుతారా అన్నది త్వరలోనే తేలిపోతుంది.  కాస్త వెయిట్ చేస్తే చాలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: