కాంచనమాల కేబుల్ టివి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మి రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలైతే చేస్తుంది కాని స్టార్ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. స్పెషల్ సాంగ్స్ తో పాటుగా అడపాదడపా గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాయ్ లక్ష్మి తమిళంలో సిండ్రెల్లా సినిమాలో నటిస్తుంది. 


అదే కాకుండా తెలుగులో కర్తవ్యం సినిమాను గుర్తుచేసేలా కన్నడలో ఝాన్సీ ఐపిఎస్ సినిమా చేశారు రాయ్ లక్ష్మి. సినిమాలో యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది రాయ్ లక్ష్మి. గురు ప్రసాద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రాజేష్ కుమార్ నిర్మించారు. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో రాయ్ లక్ష్మి యాక్షన్ సీన్స్ సర్ ప్రైజ్ అయ్యేలా చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హింది రైట్స్ కొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారట.      


ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచడంతో ఝాన్సీ ఐపిఎస్ ను అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈమధ్య కన్నడ సినిమాలు వేరే భాషల్లో కూడా సత్తా చాటుతున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా కన్నడ సినిమా సత్తా ఏంటో చాటి చెప్పింది. ఇప్పుడు అదే తరహాలో కొన్ని కన్నడ సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నాయి.  


రాయ్ లక్ష్మి తెలుగులో రీసెంట్ గా వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమా చేసింది. అదికూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సైలెంట్ అయ్యింది. ఎప్పటికైనా తన టాలెంట్ చూపించేలా సూపర్ హిట్ కొట్టేదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది రాయ్ లక్ష్మి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి రాయ్ లక్ష్మి కూడా పెద్దగా రిస్క్ తీసుకోవట్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: