సాహో గురించి చెప్పాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా. ఎంత భారీ సినిమా అనే దాని కన్నా ఎంత ప్రభావితం చూపించబోతోంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు వందకోట్ల రూపాయల వసూలు చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్న సినిమా ఇది. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమా ప్రభావం దాదాపు మూడు నాలుగు తెలుగు సినిమాల మీద పడబోతోంది. సాహో సినిమాకు కాస్త వెనుకగా వరుణ్ తేజ్ వాల్మీకి, నాని గ్యాంగ్ లీడర్ విడుదల కాబోతున్నాయి. అలాగే సాహో సినిమా వచ్చిన నెలరోజులకు మెగాస్టార్ సైరా వస్తోంది. ఈ మూడు సినిమాలకు సాహో పెద్ద సమస్యగా మారబోతోందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.  

సాహో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికే ఎక్కువ చాన్స్ వుంది. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ఆ సినిమా కంటెంట్ ను, క్వాలిటీని క్లియర్ గా చెప్పాయి. ఆ సినిమా మేకింగ్ టాప్ లెవెల్లో వుందని అన్నీ ఇండస్ట్రీస్ నుండి విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అందుకే రెండువారాల తరువాత విడుదలయ్యే వాల్మీకి, గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల కంటికి ఆనడం లేదు. సాహో బ్లాక్ బస్టర్ అయితే ఆ రెండు సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుందనడంలో అనుమానమే లేదు.

ఇక నెలరోజులు తర్వాత రిలీజయ్యో సైరాకు కష్టమేనని తెలుస్తోంది. సాహో బ్లాక్ బస్టర్ అయితే, కచ్చితంగా అన్ని రకాలుగా సైరా తో కంపారిజన్ ఉంటుంది. అంతేకాదు క్వాలిటీ విషయంలో జనం పోల్చుకుంటారు. జోనర్ వేరయినా, మిగతా వర్క్ విషయంలో ఇది తప్పదు. ఏమాత్రం తేడావున్నా సైరాకు కష్టం అవుతుంది. అలాగే బ్లాక్ బస్టర్ అయితే సినిమా నాలుగు వారాలు కనీసం థియేటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఈ లెక్కన సైరాకు థియేటర్లు అనుకున్నన్ని దొరకడం కష్టం. 

సాహో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 100 కోట్ల వరకు అడ్వాన్స్ ల రూపంలో ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇచ్చిన అడ్వాన్స్ లు అన్నీ సెటిల్ కావాలి అంటే కనీసం అయిదారువారాలు పడుతుంది. సినిమా హిట్ అయితే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చేస్తాయి కానీ, అదృష్టం బాగాలేక తేడా వస్తే మాత్రం అంత సులువుగా వెనక్కు రావడం కష్టం. 

అలాంటి నేపథ్యంలో సైరా సినిమాకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టాలి అంటే అంత సులువుకాదు. ఎందుకంటే టాలీవుడ్ లో వంద కోట్ల మొత్తం సాహో మీద వుంటుంది. అందువల్ల టాలీవుడ్ లో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సినిమాలను సాహో విపరీతంగా ప్రభావితం చేయడం మాత్రం పక్కా. సాహో సక్సెస్ అయినా కాకపోయినా సైరాకు  దెబ్బేనని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: