ఆగస్టు 20 న సైరా నరసింహారెడ్డి టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటిదాకా పోస్టర్లు, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేసిన కొణిదెల సంస్థ ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి బర్త్ డే వస్తున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు మెగా గిఫ్ట్ ని రెడీ చేసింది. ఇప్పటికే చిరంజీవి సైరా కంప్లీట్ లుక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమా టీజర్ లాంచే పెద్ద గ్రాండ్ ఈవెంట్ గా చేస్తున్న తరుణంలో సైరాకు ఇంకా ఆరేంజ్ లో చేస్తారో అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

అయితే ఫిల్మ్ నగర్ నుండి అందిన సమాచారం ప్రకారం టీజర్ లాంచ్ కు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయడం లేదట. దీనికి సంబంధించి అభిమాన సంఘాలకు మెసేజ్ కూడా వెళ్లిందట. 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో టీజర్ ఈవెంట్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సైరా టీజర్ ఒకేసారి ఆన్ లైన్ లో చూడటమేనని అర్థమవుతుంది. అంతేకాదు అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా రేపే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన సైరాకు ఇప్పటికే బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ అయ్యాక ఈ డీల్స్ ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత రెండేళ్ల గ్యాప్ తో చేస్తున్న సినిమా కాబట్టి సైరా మీద అన్ని రకాలుగా అంచానాలు మాములుగా లేవు. అందులోనూ బాహుబలిని దాటే సినిమాగా సైరాను చూస్తున్నవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇక విడుదలకానున్న టీజర్ ను బట్టి సైరా మీద ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: