సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అన్ని క్రాఫ్టులలో వారి హ్యాండ్ మనం చూడొచ్చు. వారే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు. వారే సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ల సంక్షేమం కోసం నిర్వహించబోతున్న వేడుకకి సినీ పరిశ్రమ మొత్తం అండగా ఉంటుంది అని అన్నారు నిర్మాతలు దిల్రాజు, కె.ఎస్.రామారావు,  సి.కల్యాణ్.

 

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 8న హైదరాబాద్లో ‘సినీ రథ సారథుల రజతోత్సవం’ పేరుతో ఓ వేడుకని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాతలుగా తెరపైన మా పేరే ప్రముఖంగా పడినా కష్టం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లదే.

 

వాళ్ల సంక్షేమం పరిశ్రమకి ఎంతో అవసరం. వేడుకకి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామ’’న్నారు కె.ఎస్.రామారావు. నిర్మాతల మండలి తరఫున సహకారం ఉంటుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు.

 

ఇంకా కోశాధికారి ఐన రాజీవ్ కనకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ నాయకులు అమ్మిరాజు, ఆర్.వెంకటేశ్వరరావు, సతీష్, వివేక్ తదితరులు పాల్గొని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ల కష్టాలను, గొప్పతనాల గురించి పేరుపేరునా వివరించారు. జీవిత రాజశేఖర్ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లను ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ సందర్భంగా సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతూ, తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాధారణంగా ఒక్కో సినిమాకు 7 నుండి 40 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి 12 నుండి 60 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే 60 నుండి 90 కోట్ల వరకు వ్యాపారం జరగోచ్చు. కానీ నాడు మన సినిమాలు అన్నిటిని తలదన్నుతూ అత్యధికంగా వసూళ్లు సంపాదిస్తున్నాయని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: