సాహో హోరు ఓ వైపు తెలుగు రాష్ట్రాలతో పాటు, భారతదేశాన్ని మొత్తం సునామీలా విస్తరించింది. టీజర్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చూసుకుంటే సాహో బంపర్ హిట్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సాహో విజయం ప్రభాస్ ని ఎక్కడికో తీసుకుపోతుందన్న సినీ పండితుల అంచనాలు కూదా ఉన్నాయి. బాహుబలితో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారారు. ఇపుడు సాహో కనుక హిట్ అయితే ప్రభాస్ రేంజి ని కనీసం వూహించడం కూడా కష్టమేనని అంటున్నారు.


ఇదిలా ఉండగా అద్భుతమైన ప్రజాదరణతో ఉన్న ప్రభాస్ రాజకీయాల్లోకి కూడా  వస్తారా అన్న చర్చ కూడా ఓ వైపు సాగుతోంది. దీని మీద తమ డౌట్లను ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు, బీజేపీ నేత క్రిష్ణంరాజునే మీడియా అడిగేసింది. ప్రభాస్ ని మీరు బీజేపీలో చేర్పిస్తారా అన్న దానికి క్రిష్ణంరాజు తెలివిగానే బదులిచ్చారు. ప్రభాస్ రేంజి ఇపుడు ఇంటర్నేషనల్. ఆయన తెలుగు రాష్ట్రాలకో, ఇండియాకో పరిమితం కావడంలేదు. అందువల్ల ఆ స్టాటస్ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి.


ఇంకా ప్రభాస్ కి సినిమా రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉందని చెప్పారు. అందువల్ల ప్రభాస్ తన పొలిటికర్ ఎంట్రీ మీద తానే ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకుంటాడని కూడా అన్నారు. తాను మాత్రం ఆయన సినీ జీవిత ఉజ్వల భవిష్యత్తునే కోరుకుంటున్నట్లుగా క్రిష్ణంరాజు చెప్పుకొచ్చారు. 


మొత్తానికి పెద నాన్న బీజేపీలో ఉండడం, సినిమా స్టార్ల మీద కమలం కన్ను పడుతున్న నేపధ్యంలో ప్రభాస్ పైన కూడా వల వేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అది ఎపుడు అన్నది తెలియకపోవచ్చు కానీ ప్రభాస్ ని తమ వైపునకు లాగేందుకు కాషాయదళం మాత్రం గట్టిగానే ట్రై చేస్తుందన్నది రాజకీయ పండితుల అంచనా. మరి యంగ్ రెబెల్ స్టార్ ఏమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: