అనుష్క శర్మ.. మోస్ట్ టాలెంటెడ్ నటి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఆమె నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  తరువాత ఈ అమ్మడు  క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమలో పడింది.  చాలా సంవత్సరాలు ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు.  అనంతరం ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.  ఒకవైపు సినిమాలు చేస్తూనే అనుష్క, మరోవైపు కాపురాన్ని చక్కదిద్దుకుంటోంది.  


ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలను తగ్గించేసింది.  ఎక్కువ సమయం విరాట్ కోహ్లీతోనే గడుపుతున్నాడు.  ప్రస్తుతం విరాట్ వెస్ట్ ఇండీస్ టూర్ లో ఉన్నాడు.  ఇప్పటికే ఇండియా టి 20, వన్ డే మ్యాచ్ లను గెలుచుకుంది.  ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.  సమయం దొరికినపుడు విరాట్ తన భార్య అనుష్కతో కలిసి బీచ్ కు వెళ్తున్నాడు.  


అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.  రీసెంట్ గా అనుష్క శెట్టి ఆంటిగ్వాలోని ఓ బీచ్ కు వెళ్ళింది.  అక్కడ భర్త విరాట్ తో కలిసి ఆ బీచ్ లో విహారం చేసింది.  ఆరెంజ్ కలర్ బికినీలో ఓ రేంజ్ లో ఫోజులు ఇచ్చింది. పెళ్లి తరువాత కూడా అనుష్క ఈ రేంజ్ లో బికినీతో ఫోజులు ఇవ్వడం నిజంగా వండర్ అని చెప్పాలి.  బికినీ ఈ అమ్మడు చేసిన హంగామా అంతాఇంతా కాదు.  


ఇప్పుడు అనుష్క బినికి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  చాలా కాలం తరువాత అనుష్క బికినీ ఫోటోలు కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  పెళ్లి తరువాత కూడా అనుష్క ఏ మాత్రం తగ్గడం లేదని, అదే అందాన్నిమెయింటైన్ చేస్తోందని అంటున్నారు.  షారుక్ తో జీరో సినిమా తరువాత ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు.  దీన్ని బట్టి చూస్తే అనుష్క సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుందేమో అనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: