బాహుబలి సినిమా విడుదలకు ముందుగానే ప్రభాస్ హానీమూన్ ఉంటుందన్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లికి ఆయన పెద్దలు ఎంతో కాలంగా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా బాహుబలి ని తెరకెక్కిస్తుండడంతో తన పెళ్లి దీనికి ఆటంకంగా మారుతుందని ప్రభాస్ వాయిదా వేసుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే రాజమౌళి ఈ మద్యనే ప్రభాస్ షాకింగ్ న్యూస్ వినిపించాడట. బాహుబలి ఒకే సినిమాగా కాక రెండు పార్ట్ లుగా ఉంటుందని చెప్పాడట. అంతే కాదు 2015 లోపు సినిమా పూర్తికావడం కూడా కష్టమేనని తెలిపాడట. ఈవార్త తెలిసిన ప్రభాస్ ఇంటి వారు ఇక పెళ్లి చేసుకో అంటూ తొందరపెడుతున్నారని సమాచారం. టాలీవుడ్ లో నీతోటి వాళ్లంతా పెళ్లి చేసుకున్నారు, నీవేమి బాలీవుడ్ హీరోవు కాదు, 40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అన్నారట. దీంతో ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అంటే బాహుబలి విడుదలకు ముందుగానే ప్రభాస్ పెళ్లి కావడం, హానీమూన్ కి వెల్లి రావడం అయిపోతుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: