యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఆ సినిమాలో వాడిన కార్లు, బైకులు, ట్యాంకర్లు మొదలైన వాటిని వినియోగించారు.  వీటిని ప్రీ రిలీజ్ వేడుకలో వీటిని ప్రదర్శనగా ఉంటారు.  


వీటిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  దాదాపు రూ. 250 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ఈ సినిమాకు మైనస్ పాయింట్ ఏంటి అంటే సాంగ్స్ అని చెప్పాలి.  సినిమాను పూర్తిగా యాక్షన్ మోడీ లో తెరకెక్కించారు తప్పించి.. సినిమాకు సాంగ్స్ కావాలని, టాలీవుడ్ అభిమానులు వాటినే ఎక్కువగా లైక్ చేస్తారని ఊచించలేదు.  


ఇక్కడ అసలు విషయం ఏమిటంటే నిన్న ప్రీ రిలీజ్ వేడుకలో సినిమాలోని మూడో సాంగ్ ను రిలీజ్ చేయడం.  ఈ సాంగ్ నిజంగా సూపర్ అని చెప్పొచ్చు.  విజువల్స్ పరంగా పాట పిచ్చెక్కించింది.  అయితే, ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉన్నది.  మాములుగా ఇలాంటి సాంగ్స్ క్లైమాక్స్ లో వస్తుంటాయి.  హీరో ఎలివేషన్ చేసే సాంగ్స్ వేరుగా ఉంటాయి.  


కానీ, ఇందులో దానికి విరుద్ధంగా ఉండబోతుందని తెలుస్తోంది.  బాడ్ బాయ్ సాంగ్ హీరో ఎంట్రీ సాంగ్ గా ఉండబోతున్నట్టు సమాచారం.  ఈ సాంగ్ తోనే ప్రభాస్ ఎంట్రీ ఇస్తారట.  జేమ్స్ బాండ్ తరహాలోనే రొమాంటిక్ గా కనిపించాలి అంటే పూర్తి సినిమాలో సాధ్యం కాదు కాబట్టి సాంగ్ రూపంలో చూపించాలని అనుకున్నారని, అందుకే ఈ సాంగ్ ను షూట్ షూట్ చేశారని తెలుస్తోంది.  బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: