రామయ్యా... ఇద్దరిని ముంచావయ్యా అన్న టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో. ఈ సినిమా హీరో ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ ను కూడా పడేసింది అంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ తర్వాత హరీష్ శంకర్ తీసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ కొడుతుందని అందరు ఆశించారు. అయితే అది అనూహ్యంగా ఫెయిల్ కావడంతో హీరోగా ఎన్టీఆర్ ఫ్లాఫ్ ల లిస్ట్ లోకి వెల్లి పోయి పవర్ పోగొట్టుకున్నాడు అంటున్నారు. అంతే కాదు గబ్బర్ సింగ్ ఇచ్చిన హిట్టు కూడా రామయ్యా వస్తావయ్యా ఇచ్చిన ఫెయిల్యూర్ నుంచి హరీష్ శంకర్ ను కాపాడలేదని సమాచారం. కారణం డివివి దానయ్య హరీష్ శంకర్ తో సినిమా తీసేందుకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడట. అయితే రామయ్యా వస్తావయ్యా ఫెయిల్ అయిన తర్వాత ఆ డబ్బులు వాపస్ తీసుకున్నాడు అంటున్నారు. అంటే హరీష్ శంకర్ ను కూడా రామయ్య ముంచాడన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: