ప్రభాస్ చాల బుద్దిమంతుడు అనుకున్నారు ఇంతకాలంఅభిమానులు కాని సాహో సినిమాయూనిట్ మాత్రం ప్రభాస్ బ్యాడ్ బాయ్ అంటున్నారు ఎందుకంటే చాల పొట్టిపొట్టి బట్టలెసుకున్న అమ్మాయిలతో హాట్ హాట్ రోమాన్స్ చేస్తూ దొరికిపోయాడట. అయ్యో ఇదినిజంకాదండి ‘సాహో’సినిమాలో ప్రభాస్ పాడుకున్న పాట.ఇక విషయానికి వస్తే ‘సాహో’సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుందని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది.ఈ వార్తలను నిజం చేస్తూ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో తన అభిమానులకు జాక్వెలిన్‌ను ప్రభాస్ పరిచయం చేశారు.



ఈ వేడుకలో విడుదల చేసిన‘సాహో’మూడో పాట‘బ్యాడ్ బోయ్’లో ప్రభాస్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆడిపాడుతూ ఆడియన్స్‌కి మాంచి కిక్కిస్తోంది..ఐతే ఈ సాంగ్ ను ఆదివారంజరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేశారు కానీ కొద్దిసేపటి క్రితమే సామాజిక మాధ్యమాల్లో వదిలారు..,‘సాహో'ప్రమోషన్స్‌లో భాగంగా రెండు పాటలు ఇది వరకే విడుదల చేయగా అవి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక తాజాగా‘బ్యాడ్ బాయ్'అంటూ సాగే ఈ పాట మరింత కిక్కివ్వడంతో ‘సాహో’సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌కి తోడు రొమాంటిక్ డోస్ కూడా యాడ్ చేశారని స్పష్టమైంది.



ఈ స్పెషల్ సాంగ్ లో తన అందచందాలతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదరహో అనిపించిందని ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని అభిమానుల గుసగుసలు.వాస్తవానికి ఈ సినిమాలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి.కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు.అలాంటిది నిన్న జరిగిన ఈవెంట్‌లో ఒక్కసారిగా ఈ సాంగ్ విడుదల చేయడంతో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారట.ఇప్పుడు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేయడం ‘సాహో’కి కలిసొచ్చే అంశం అని అంతా అనుకుంటున్నారు.శ్రీజో సాహిత్యం అందించిన ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరచగా,నీతి మోహన్‌తో కలిసి ఆయనకూడ పాడారు..ఇక భారీ అంచనాలమధ్య సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: