మెగాస్టార్ 150 తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తో వస్తున్న సినిమా సైరా. 270 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకెళ్ళబోతుందని.. ఈ సినిమా కోసం చిరంజీవి బాగా బరువు తగ్గుతున్నాడన్న ప్రచారం ఆయన కొత్త లుక్ బయటికొచ్చిన దగ్గరనుండి జరుగుతుంది. ఇక సైరా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన చిరు కూడా కొరటాలతో చెయ్యబోయే సినిమా గురించి బాగా బరువు తగ్గుతున్నారు కూడా. 

అయితే కొరటాల శివ - చిరంజీవి కాంబోలో తెరకెక్కబోయే సినిమా రైతు సమస్యల నేపథ్యంలో ఉండబోతుందని, చిరు ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయబోతున్నారనే వార్త బాగా స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే. ఇక దాదాపుగా కొరటాల శివ చెప్పిన కథకు చిరు ఎప్పుడో కనెక్ట్ అవడం, పూర్తి స్క్రిప్ట్‌తో కొరటాల కూడా చిరు కోసం వెయిట్ చెయ్యడం కూడా అందరికి తెలిసిన విషయమే. దాదాపు సంవత్సరం పైగా కొరటాల మరే సినిమాని కమిటవకుండా మెగాస్టార్ కోసం వేయిట్ చేశాడంటే కొరటాల మెగాస్టార్ తో సినిమాని తెరకెక్కించాలని ఎంత దృఢంగా ఉన్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గనక చిరు తో సినిమా చేసే ఛాన్స్ మిస్సయితే మళ్ళీ ఎప్పటికి సెట్ అవుతుందో తెలీదు. 

ఇక కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటుందో మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో అందరికి తెలిసిన సంగతే. అయితే ఫుల్ స్క్రిప్ట్ తో వెయిట్ చేస్తున్న కొరటాలతో చిరు రీసెంట్‌గా మన కథ మారిస్తే బావుంటుందని.. ఖైదీ నెంబర్ 150, మహేష్ మహర్షి సినిమాల్లో రైతు సమస్యల పై తీసిన కాన్సెప్ట్ గనక మనం మళ్లీ చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పడంతో కొరటాల కూడా అది నిజమేనని ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా ఫిలింనగర్ లేటెస్ట్ న్యూస్. ఇక కథ ఫైనల్ అయ్యాక చిరు మరోసారి కొరటాలతో చర్చించిన తరవాతే చిరు - కొరటాల కొత్త సినిమా పట్టాలెక్కుతుందనేది తాజా సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: