చిన్న సినిమాలతో హీరోయిన్ గా పరిచయమై స్టార్ ఛాన్సులు అందుకున్న రకుల్ తెలుగు, తమిళ, హింది భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అందం అభినయం రెండిటిని సమపాళ్లలో కనబరిచే రకుల్ స్పైడర్ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు వచ్చినట్టు కనిపించలేదు. అయితే ఈలోగా హింది, తమిళ భాషల్లో సినిమాలు చేసింది ఈ పంజాబీ బ్యూటీ.     


రీసెంట్ గా తెలుగులో కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2లో నటించింది రకుల్. సినిమా ఫలితం ఎలా ఉన్నా రకుల్ ఆ సినిమాలో కూడా రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. మడి కట్టుకు కూర్చుంటే ఛాన్సులు ఎలా వస్తాయన్న లాజిక్ ముందే కనిపెట్టేసిన రకుల్ చేసే ప్రతి సినిమాలో తన ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేస్తూ వస్తుంది. కేవలం సినిమాల్లోనే కాదు అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్, గ్లామర్ షో బయట కూడా అదే రేంజ్ లో ఉంటుంది.  


లేటెస్ట్ గా స్పెయిన్ బీచ్ లో బికినితో జలకాలాడుతుంది రకుల్. తన అందచందాలతో కుర్ర కారుని మత్తులో దించేస్తున్న ఈ అమ్మడు తన బికిని పిక్స్ ను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రస్తుతం రకుల్ హాట్ బికిని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాలీ ట్రిప్ లో భాగంగా రకుల్ స్పెయిన్ లోని ఐబిజా ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తుంది.        


ఇలా రకుల్ బికిని పిక్స్ అప్లోడ్ చేసిందో లేదో నిమిషాల్లో అవి వైరల్ గా మారాయి. ఈమధ్యనే హిందిలో దే దే ప్యార్ దే సినిమాతో హిట్ అందుకున్న రకుల్ బాలీవుడ్ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి. హాట్ హాట్ స్టిల్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ మెయింటైన్ చేస్తూ దానికి తగినట్టుగానే గ్లామర్ షో చేస్తున్న రకుల్ ఛాన్స్ వస్తే రెచ్చిపోయేందుకు రెడీ అన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కన్నా బాలీవుడ్ లోనే ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: