బాలీవుడ్ తారలలో శిల్పా శెట్టిని ఫిట్ నెస్ గా ఐకాన్  గా చెప్పుకుంటారు. ఎంత వయసొచ్చిన ఆమె ఫిట్ నెస్ చూస్తే అందరికీ మతి పోవాల్సిందే. స్వతహాగా  యోగా ట్రైనర్ అయిన శిల్పాశెట్టి ఫిట్ నెస్ గా ఉండడమే కాదు ఆ ఫిట్ నెస్ రహస్యాలు నలుగురితో పంచుకుంటుంది. దానికోసం ఆమె ఫిట్ నెస్ పై వీడియోలు కూడా చేస్తుంటుంది. ౪౪ ఏళ్ళచ్చిన చెక్కు చెదరని అందంగా ఉండే ఈ బ్యూటీ రోజూ వారి వ్యాయామాల్లో చాలా స్ట్రిక్టుగా ఉంటుంది.


అందు నలభైల్లో ఉన్న కూడా  ఇరవైల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే తాజాగా ఓ ఆయుర్వేదిక్ సంస్థ బరువు తగ్గించే తమ ప్రోడక్ట్ కి ప్రచార కర్తగా ఉండమని కోరగా ఆమె దాన్ని సున్నితంగా  తిరస్కరించారన్నవిషయం తెలిసిందే. అయితే  ఆమెకు ఆ సదరు సంస్థ 10కోట్ల భారీ పారితోషకం ఆఫర్ చేసినా శిల్ప ససేమిరా అందట. నిజం చెప్పాలంటే అంత పెద్ద ఆఫర్ ని ఎవరూ కాదనరు.


మరి ఆ  ఆఫర్ ని వదిలివేయడం వెనుక గల కారణాలను వెలికితీయడానికి ఓ ప్రముఖ పత్రిక ఆమెనిసంప్రదించగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారట. నేను నమ్మని సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేయను. టాబ్లెట్స్ వేసుకోవడం వలన స్లిమ్ గా తయారవడం జరగని పని, ఒకవేళ ఆలా జరిగినా అది ఆరోగ్యానికి మంచిది కాదని  చెప్పింది


క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యరకరమైన ఆహారపు అలవాట్లు మాత్రమే ధీర్ఘకాలపు ఫలితాలను ఇస్తాయంటూ ఆమె చెప్పుకొచ్చారు.బాలీవుడ్ కి చెందిన శిల్పా శెట్టి తెలుగులో వెంకటేష్ సరసన సాగరవీరుడు సాగరకన్య, నాగార్జున తో ఆజాద్, మోహన్ బాబు ప్రక్కన వేడెవడండీ బాబు చిత్రాలతో పాటు బాలకృష్ణ హీరోగా వచ్చిన భలేవాడివి బాసు మూవీలో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: