సాహో ఇపుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఇదే చర్చ. ప్రభాస్ రెండేళ్ల కష్టం సాహో. బాహుబలి తరువాత వస్తున్న మూవీ సాహో. రాజమౌళి డైరెక్షన్లో కాకుండా విడిగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసే చిత్రం సాహో. ఆల్ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్లోనూ ఎక్కువ షోలు వేస్తున్న మూవీ సాహో. బాలీవుడ్, టాలీవుడ్లతో పాటు అన్ని వుడ్లని ఏకం చేసి అలా చూసేలా చేసిన మూవీ సాహో.


సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే లక్ష మందికి పైగా అభిమాన జనం రావడం అంటే అది తమాషా కాదు,  అదొక రికార్డ్. ఇప్పటివరకూ అలా జరగలేదు. దాంతోనే సాహోపై అంచనాలు  పెరిగిపోతున్నాయి. సాహో టీజర్లు, ప్రొమో సాంగ్స్ కూడా ఇపుడు ఎక్కడ చూసినా హల్ చల్ చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సాహో సంచలనం అంతా ఇంతా కాదు.


ప్రభాస్ ని నమ్మి యూవీ క్రియేషన్స్ 350 కోట్ల పెట్టుబడి పెట్టిందంటే ఓ సౌతిండియన్ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో తెలుస్తోంది. అంతే కాదు ఇపుడు బాలీవుడ్ బీ టౌన్ కూడా నోరెళ్ళబెట్టి చూస్తోంది. ఒక్క ప్రభాస్, వందల కోట్లు అదే సాహో సినిమా. ఎంత దమ్ముంది. ఎంత దైర్యం ఉంది అన్నది సాహో మేకింగ్ లోనే తెలిసిపోతోంది.


ఈ మూవీలో యాక్షన్ సీన్లు హాలీవుడ్ ని తలపిస్తున్నయి. సాంగ్స్ లో రిచ్ నెస్ అదిరిపోతోంది. రోమాన్స్ చేయడానికి శ్రద్ధాకపూర్ సై అంటోంది. అందుకే మరో హిట్ చెప్పి మరీ కొట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. సాహో హిట్ కొట్టి రాజమౌళి లేకపోయినా తాను బాహుబలినేనని చెప్పడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ కి ఇది రెండవ సినిమా మాత్రమే. అంటే కేవలం ప్రభాస్ తన భుజాలా మీదనే ఈ మూవీ అంతా మోస్తున్నాడన్నమాట. చూడాలి మరి ఈ నెల 30న సాహో సునామీ ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: