గత ఏడాది విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, అలానే రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం సినిమాలు, సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి, కొన్ని కేంద్రాల్లో నాన్ బాహుబలి రికార్డులను అందుకుని టాలీవుడ్ సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాయనే చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన సైమా 2019 అవార్డుల్లో ఏకంగా 9 అవార్డులను గెలుచుకున్న రంగస్థలం, అతి త్వరలో ప్రకటించబోయే నంది అవార్డుల్లో ఎన్ని విభాగాల్లో అవార్డులు సంపాదిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాకు సైమాలో అవార్డులు దక్కనప్పటికీ, త్వరలో ప్రకటించే నంది అవార్డుల్లో, 

మరీ ముఖ్యంగా బెస్ట్ హీరో క్యాటగిరిలో చరణ్ కు మహేష్ గట్టి పోటీ ఇస్తారనే అంటున్నారు. అయితే తన కెరీర్ పరంగా రంగస్థలం మూవీ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన చరణ్ కు, ఈ సారి నంది రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక మహేష్ కూడా భరత్ అనే నేను లో చీఫ్ మినిస్టర్ గా నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందడం జరిగింది. అయితే జానర్ల విషయానికి వస్తే, రంగస్థలం పూర్తిగా 1980ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే, భరత్ అనే నేను ప్రస్తుత కాలంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. సక్సెస్ పరంగా చూస్తే, భరత్ అనే నేను, రంగస్థలం రెండూ అద్బుతమైన విజయాలు అందుకున్నాయనే చెప్పాలి. అయితే నంది అవార్డులను కలెక్షన్స్ మరియు సినిమా సక్సెస్ ని బట్టి కాకుండా, 

ఎక్కువగా నటి లేదా నటుడు చేసే పెర్ఫార్మన్స్ ని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది కనుక, ఈసారి అటు మహేష్, ఇటు చరణ్ ల నటన విషయంలో జ్యూరీ మెంబెర్స్ కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి సినిమా నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే నంది పురస్కారాన్ని గత ఏడాదికి గాను మహేష్ లేదా చరణ్ లో ఎవరు అందుకుంటారో, లేదా వారిద్దరిని కాకుండా ఇంక మరెవరినైనా ఆ అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మాత్రం, మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...!!


మరింత సమాచారం తెలుసుకోండి: