సినీ విమర్శకుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై అవకాశం దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఈ విషయమై పవన్ అభిమానులకు కత్తి మహేష్ కు అనేక వివాదాలు కూడ జరిగాయి. అయితే గత కొంత కాలంగా పవన్ ను టార్గెట్ చేసే విషయంలో మౌనంగా ఉంటున్న కత్తి మహేష్ ఈసారి మరింత పదునైన సంచలనాలతో పవన్ పై మాటల దాడి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. 

ఇప్పటికే పవన్ అమరావతిలో ‘జనసేన’ కోసం కట్టిన ఇంటి విషయంలో కొన్ని విమర్శలు వచ్చిన నేపధ్యంలో వాటికి కొనసాగింపుగా పవన్ హైదరాబాద్ లో అత్యంత విలాస వంతమైన ఇల్లు కొనుకున్నాడు అంటూ కత్తి మహేష్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. అంతేకాదు ఈ విలాసవంతమైన ఇంటి విలువ 130 కోట్లు ఉంటుంది అంటూ కత్తి మహేష్ పేరుతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ట్విట్ వైరల్ గా మారింది. 

పార్టీని నడపడానికి డబ్బులు లేవు అని చెప్పే పవన్ ఇంత ఖరీదైన ఇల్లు హైదరాబాద్ లో ఎలా కొన్నాడు అంటూ ఆ ట్విట్ సారాంశం. దీనితో ఈ ట్విట్ నిజంగానే కత్తి మహేష్ చేసాడా ? లేకుంటే తిరిగి పవన్ పై బురద జల్లడానికి ఎవరో కావాలని కత్తి మహేష్ పేరు వాడుకుని ఇలాంటి రగడ సృష్టిస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఎన్నికల ఓటమి షాక్ నుండి తేరుకుని పవన్ జనసైనికులకు ధైర్యం చెపుతూ తిరిగి జనం మధ్య తిరుగుతున్న పరిస్థితులలో పవన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీయాలని ఇలాంటి నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు అనే వాదన కూడ ఉంది. దీనికితోడు పవన్ ‘సైరా’ ట్రైలర్ కు వాయస్ ఓవర్ చెప్పడంతో తిరిగి పవన్ సినిమాల వైపు వస్తాడా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పుకార్లు కత్తి మహేష్ పేరును ఉపయోగించుకుని సృష్టిస్తున్నారా అని అనిపించడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: