నాలుగు వారాల క్రిందట ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటివారం ఈ షో నుండి హేమ ఎలిమినేట్ కాగా రెండో వారం జాఫర్ ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం తమన్నా సింహాద్రి ఈ షో నుండి ఎలిమినేట్ కాగా నాలుగవ వారం ఈ షో నుండి రోహిణి ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. మొదట కెప్టెన్ అలీని నామినేట్ చేయాలనుకున్న నలుగురు ఇంటి సభ్యుల పేర్లు చెప్పమని బిగ్ బాస్ అడుగుతాడు. అలీ రాహుల్, వితిక, హిమజ, బాబా భాస్కర్ ను నామినేట్ చేస్తాడు. ఈ నలుగురిలో ఒకరిని మాత్రమే అలీ నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెబుతాడు. 
 
గతవారం రోహిణితో కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చిన తరువాత నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించినందుకు శివజ్యోతి నేరుగా నామినేట్ అవుతుంది. బిగ్ బాస్ రెడ్ బాల్ వస్తే కన్ఫెషన్ రూమ్ కు వచ్చి రెండు పేర్లు చెప్పమని బ్లాక్ బాల్ వస్తే ఇద్దరు ఇంటి సభ్యులకు ఎరుపు రంగు పూసి చెప్పమని చెబుతాడు. పునర్నవి హిమజ, రాహుల్ ను నామినేట్ చేస్తుంది. బాబా భాస్కర్ రాహుల్, అషు రెడ్డిని నామినేట్ చేస్తాడు. 
 
రవికృష్ణ రాహుల్, హిమజను నామినేట్ చేస్తాడు. వితిక మహేశ్ విట్టా, అషు రెడ్డిని నామినేట్ చేస్తుంది. శ్రీముఖి రాహుల్, అషు రెడ్డిని నామినేట్ చేస్తుంది.రాహుల్ సిప్లిగంజ్ హిమజ, శ్రీముఖిని నామినేట్ చేస్తాడు. అషు రెడ్డి హిమజ, రాహుల్ ను నామినేట్ చేస్తుంది. వరుణ్ రాహుల్, మహేశ్ విట్టాను నామినేట్ చేస్తాడు. శివ జ్యోతి పునర్నవి, రాహుల్ ను నామినేట్ చేస్తుంది. మహేశ్ విట్టా రాహుల్, వరుణ్ సందేశ్ ను నామినేట్ చేస్తాడు. హిమజ పునర్నవి, అషు రెడ్డిని నామినేట్ చేస్తుంది. 
 
బిగ్ బాస్ అలీని నలుగురు ఇంటి సభ్యులలో ఎలిమినేషన్ కు నామినేట్ కాని వారిని ఎంపిక చేయమని చెప్పగా అలీ బాబా భాస్కర్ ను నామినేట్ చేస్తాడు. ఈ వారం ఎలిమినేషన్ కు రాహుల్ సిప్లిగంజ్, హిమజ, అషు రెడ్డి, మహేశ్ విట్టా,పునర్నవి, బాబా భాస్కర్, శివ జ్యోతి నామినేట్ అయ్యారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: