మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలని, ముఖ్యంగా 'మా' సభ్యులై ఉండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కోరింది. దీనిపై 'మా'బృందం నరేష్‌, జీవిత, రాజశేఖర్‌, హేమ, అలీ, రాజా రవీంద్ర, ఉత్తేజ్‌, సురేష్‌ కొండేటి, అనితా చౌదరి, జయలక్ష్మి, అశోక్‌ కూమార్‌, టార్జాన్‌ తదితరులు ఇండిస్టీలో ప్రముఖ అసోసియేషన్లను కలిసి విన్నవించారు.

 

తెలుగు సినిమా మండలి కార్యదర్శి అధ్యక్షుడు సి.కల్యాణ్‌, కార్యదర్శి సుప్రియ, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్‌.శంకర్‌ని, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణని వీరంతా కలిశారు. ఈ సందర్భంగా 'మా' అధ్యక్షులు నరేష్‌ మాట్లాడుతూ 'మా సభ్యులుగా ఉన్న చాలా మంది వేషాలు లేక బాధపడుతున్నారని వారి కోసం మేమందరం కలిసి ఈ నాలుగు ఆర్గనైజేషన్లను కలిశాం' అని చెప్పారు. 'మా' సభ్యుల్లో ముఖ్యంగా మహిళలకు వేషాలు లేక బాధల్లో ఉన్నారని హేమా అన్నారు.

 

'మా' కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా పెడతామని, అందులో దాదాపు అందరి ఆర్టిస్టుల చిరునామాలు, ఫోన్‌ నెంబర్లతో పాటు వాళ్ళు చేసిన 1 నిమిషం పెర్ఫార్మెన్స్‌ వీడియో తదితర వివరాలు కూడా పొందిపరిచేలా సన్నాహాలు చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ సందర్భంగా వారు తెలుగు సినిమా గత చరిత్రను తిరగవేసారు. 1886లో లుమీర్ సోదరులు భారతదేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో "భక్త పుండరీక", 1911లో "రాజదర్బార్" అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.

 

1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగు (భక్త ప్రహ్లాద), తమిళ (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథిహెచ్.ఎమ్.రెడ్డి. సురభి నాటక సమాజం వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. అని గుర్తు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: