మరో పది రోజుల్లో విడుదల కాబోతుంది ప్రభాస్ నటించిన సాహో సినిమా. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సాహో సినిమాకు మరో 100 కోట్ల రుపాయలు శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కొత్త వార్త వినిపిస్తుంది. ఈ వార్త ప్రకారం సాహో సినిమా నిర్మాతలకు రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేసాడని తెలుస్తోంది.  
 
నిజానికి రామ్ చరణ్ కు, యువి క్రియేషన్స్ నిర్మాతలకు మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం, వినయ విధేయ రామ సినిమాలను యువి క్రియేషన్స్ కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూషన్ చేసారు. యువి క్రియేషన్స్ కు రంగస్థలం సినిమా లాభాలను ఇవ్వగా వినయ విధేయ రామ సినిమా మాత్రం నష్టాలను ఇచ్చింది. సాహో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండటంతో సాహో నిర్మాతలకు సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. 
 
ఇలాంటి సమయంలో ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ సాహో నిర్మాతలకు ఆర్థికంగా సాయం చేసాడని తెలుస్తోంది. చరణ్ నిర్మాతలకు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఈ సినిమాలో వాటా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. సాహో సినిమాకు వచ్చే లాభాల్లో కొంత శాతం రామ్ చరణ్ కు వాటా ఉంటుందని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ లేదా రామ్ చరణ్ స్పందిస్తే తప్ప ఈ వార్తలో నిజం ఎంత ఉందనే విషయం చెప్పలేము. 
 
ఈ సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారతదేశంలో ఏడు వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో సాహో సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఉన్న ఫస్ట్ డే రికార్డులన్నీ ఈ సినిమా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: