కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అన్నాడు ఆత్రేయ. అంటే కుర్రాళ్ళదే రాజ్య‌మని అర్ధం. వయసు ఐస్ లా కరిగిపోతూంటే పట్టుకోవడం ఎవరికైనా కష్టం. సినిమా హీరోలకు వయసే పెట్టుబడి, అది మళ్ళినా, దారి తప్పినా డోర్స్ క్లోజ్ అవుతాయి. దాంతో వయసు పిచ్చి హీరోయిన్లకే కాదు ఇపుడు హీరోలకు పట్టుకుంది, యంగ్ హీరోలైఅతే మరింత స్టైలిష్ లుక్ కోసం ఆరాటపడుతూంటే సీనియార్లకు  మేకోవర్ గొప్ప ఆకర్షణగా ఉంది.


సీనియర్ హీరోలుగా టాప్ ఫోర్ టాలీవుడ్లో ఉన్నారు. చిరంజీవి బాలక్రిష్ణ నాగార్జున వెంకటేష్ వీరంతా అరవై దాటిన హీరోలే. దాంతో వీరి కొత్త సినిమాల్లో కుర్రాళ్ళుగా కనిపించేందుకు నానా రకాల ప్రయోగాలు చేస్తున్నారు. లేటెస్ట్ మూవీ షూటింగులో  బాలయ్య మేకోవ‌ర్ చూస్తే వయసు సగానికి తగ్గిపోయిందనిపిస్తోంది. అంత జాగ్రత్తగా లుక్ తెచ్చేశారు బాలయ్యకు


ఇక చిరంజీవి వయసుని మూడవవంతుగా మార్చేసింది ఆయన గారి కోడలు ఉపాసన. ఓ బ్లాక్ అండ్ వైట్ పిక్ లో మెగాస్టార్ యంగ్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దాన్ని ఉపాసన కెమెరాతో తీసిందని ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి కూడా కొత్త మూవీస్ లో గ్లామర్ హీరోయిన్లతో డ్యూయట్లు పాడాలి మరి. మరో వైపు నాగార్జున మన్మధుడు 2 మూవీతో నా వయసు ముప్పయి, ఎప్పటికీ ముప్పయ్యే అంటూ ఒకటే గొడవ చేశాడు.


ఇంకోవైపు ఎఫ్ ట్ లో యంగ్ లుక్ తో వెంకీ కూడా అదరగొట్టాడు. తన కంటే సగం వయసు ఉన్న తమన్నాతో ఆ మూవీలో డ్యూయంట్లు పాడిన వెంకటేష్ నేను ఎక్కడా తగ్గనని యంగ్ హీరోలకు సవాల్ చేశాడు. మొత్తానికి చూసుకుంటే మన సీనియర్ హీరోలు అంతా కుర్రోళ్లైపోతున్నారు. వారి స్క్రీన్  ప్రెజెన్స్ ఓ లెవెల్లో ఉంటోంది. ఈ మేకోవర్ ని బట్టి చూస్తే మరి కొన్నాళ్ళు వీరే రాజ్యం చేసేలాగా కూడా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: