తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాతల్లో అల్లు అరవింద్ టాప్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటాడు. ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఆయనను పలు కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తూంటారు. అలానే.. ఇటీవల జరిగిన సాహో ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అయితే.. ఆయన ప్రసంగాన్ని టాప్ రేటెడ్ న్యూస్ ఛానెల్ టీవీ9 ఆ సమయంలో లైవ్ ఆపేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

 

 

ఫంక్షన్ లో ఆయన వంతుగా చిన్న స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టగానే టీవీ9 లైవ్ టెలికాస్ట్ ఆపేసింది. అదే సమయంలో ఎన్టీవీ లో మాత్రం ఆయన ప్రసంగం టెలికాస్ట్ అయింది. ఇప్పుడే కాదు.. కొన్నేళ్లుగా ఏదైనా ఈవెంట్ లో అల్లు అరవింద్ స్పీచ్ ఉంటే టీవీ9 ఇలానే ఆయన స్పీచ్ కట్ చేస్తోందని పలువురు అంటున్నారు. యాడ్ కంపెనీల ఒత్తిడి, యాడ్స్ వేయాల్సి రావడంతోనే స్పీచ్ కట్ చేసుంటారని కొంతమంది అంటున్నారు. కానీ అల్లు స్పీచ్ కంటే కొంతమంది స్పీచ్ లు విసుగు తెప్పించినా వారిని టెలికాస్ట్ చేసి అరవింద్ స్పీచ్ మాత్రమే కట్ చేయడమే చర్చనీయాంశమైంది. ఫంక్షన్ నిర్వహించే మీడియా సంస్థలకు వచ్చే ఒత్తిడి వల్ల కూడా లైవ్ ఆపేసి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో వాళ్లకే తెలియాలి.

 

 

 

ఎంత లేదన్నా నిర్మాతగా లాంగ్ కెరీర్ అల్లు అరవింద్ సొంతం. భారీ చిత్రాలు, మీడియం రేంజ్, చిన్న బడ్జెట్ సినిమాలు ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తూంటాయి. మగధీర, సరైనోడు, 100 పెర్సెంట్ లవ్, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం..   సినిమాలు ఆయన ప్రొడక్షన్ నుంచి వచ్చినవే. యాదృచ్ఛికంగా కాకుండా కావాలనే ఇలా చేస్తే ఓ దిగ్గజ నిర్మాతను అవమానించినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: