‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు వున్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన అతిరథమహారధులు సినిమాపై అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్రమంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి మరియు పెదనాన్న కృష్ణం రాజు మాట్లాడుతున్న సందర్భంలో చాలా భావోద్వేగానికి లోనయ్యారు ప్రభాస్.


ఇటువంటి నేపథ్యంలో సినిమాపై చాలా అంచనాలు ఉన్న క్రమంలో తాజాగా ఈ సినిమాకి పాటల వల్ల పెద్ద ముప్పు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే సినిమా హాలీవుడ్ రేంజులో తీసినట్లు విడుదలైన ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలో హాలీవుడ్ యాక్షన్ తరహా సినిమాలు మిషన్ ఇంపాజిబుల్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి సూపర్ యాక్షన్ థ్రిల్లర్ల తరహాలో ట్రైలర్ బట్టి ‘సాహో’ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారీ యాక్షన్ సిన్స్ ఉన్న ఈ సినిమాలో...మధ్యలో పాటలు వస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమేనని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు .


అంతేకాకుండా పాటల్లో కూడా పెద్దగా కొత్తదనం లేకపోవడం ఇప్పటివరకు ఏ పాట కూడా పెద్దగా క్లిక్ కాకపోవడం బట్టి చూస్తుంటే సాంగ్స్ పరంగా 'సాహో' కి పెద్ద ముప్పు ఉందని సినిమా యూనిట్ ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు. మరోపక్క రిచ్ లొకేషన్లలో బాగా ఖర్చు పెట్టి తీశారు తప్పితే.. వాటిలో ఏ రకమైన క్రియేటివిటీ కనిపించలేదు. కాగా ఇటీవల రీసెంట్ గా విడుదల చేసిన పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పర్వాలేదనిపించింది. మొత్తంగా ఈ పాటలన్నీ చూస్తే సినిమాకు ఏ రకంగా అయినా ఉపయోగపడతాయా అన్నది సందేహంగానే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: