మన్మధుడు-౨ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు సినిమా చూసి ఏం అనుకోవాలో అర్థం కాలేదు. అడల్ట్ కామెడీలా ఉన్న ఈ సినిమా తెలుగులో వర్కవుట్ అవలేదు సరికదా నాగార్జునకి చెడ్డ పేరు తీసుకు వచ్చింది. సినిమా రిలీజ్ ముందు నుండి ముద్దు సీన్ల విషయంలో ఎన్ని  విమర్శలు వచ్చాయో తెలిసిందే.


అయితే ఇదే సమయంలో  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన "చి.ల.సౌ" సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు రావడంతో ఆయనకి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఆ సినిమా ద్వారానే రాహుల్ రవీంద్రన్ నాగార్జున ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. చిలసౌ సినిమా కి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.


అయితే మన్మధుడు -2 సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో రాహుల్ తర్వాతి సినిమా ఇప్పుడప్పుడే ఉండదని అనుకున్నారు. కానీ వాటన్నింట్ని పటాపంచలు చేస్తూ ఆయన తన సినిమా అతి తొందరలో మొదలు కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్ తన తర్వాతి సినిమా అతి త్వరలో  సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.


చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా మళ్ళీ సినిమా చేస్తున్నాడంటే నిర్మాతలకి అతనంటే ఎంత నమ్మకమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్ ఈ సినిమా చేయబోతున్నాడట. అయితే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అందులో హీరో ఎవరనేది కూడా ఇంకా తెలియదు. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం. 




మరింత సమాచారం తెలుసుకోండి: