ఉయ్యాలా జంపాల ఫేమ్ రాజ్ తరుణ్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నార్సింగ్ సమీపంలోని అల్కాపురి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అతను ప్రయాణిస్తున్న వోల్వోకారు తెల్లవారుజామున అదుపు తప్పి, డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ సురక్షితంగా బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రాజ్ తరుణ్ కు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.ప్రమాదం తర్వాత అతను మరో కారులో వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. మరోవైపు కొన్ని ఛానళ్లో తన కారుకు ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, మరో నటుడు తరుణ్ వెల్లడించారు.

ఆ ప్రమాదంలో తనకేం సంబంధం లేదని, రాత్రి నుంచి తాను ఇంటి వద్దే ఉన్నాననీ తన కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తరుణ్ స్పష్టం చేశారు. 'టియస్ జీరో నైన్ ఇఎక్స్ డబల్ వన్ డబల్ జీరో' నంబర్ గల వాహనంలో రాజ్ తరుణ్ అల్కాపురి మెయిన్ రోడ్డు మీదుగా అతివేగంగా ప్రయాణిస్తున్నటువంటి రాజ్ తరుణ్ కారు ఒక్క సారిగా అడ్డుగా ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ను ఢీ కొనటం జరిగింది.ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ కూడా కారు పూర్తిగా ధ్వంసమైంది. అదే విధంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

అక్కడ ప్రమాద సూచకాలు లేకపోవటం ఆ రోడ్డు విశాలంగా ఉండటంతో అతివేగంగా ప్రయాణిస్తూ తరచుగా ఈ ప్రమాదాలకు కారణమవుతుంది అని అక్కడ ఉన్నటువంటి వారు చెప్పారు. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కి సంబంధించినటువంటి  ప్రహారీ గోడను అతివేగంగా ఢీ కొని అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి.  అయితే ఖచ్చితంగా ఆ కారులో ప్రయాణించినటువంటి వ్యక్తి రాజ్ తరుణ్ అని పోలీసులు గుర్తించడం జరిగింది.  అయితే మొదటగా కొన్ని టీవీ ఛానళ్లో  తరుణ్ ప్రయాణిస్తున్నట్టుగా వచ్చినటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని కూడా అతను ఖండించడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: