తెలుగు బిగ్ బాస్ లోనే కాకుండా తమిళ బిగ్ బాస్ లో కూడా సీజన్ త్రీ షో సంచలనాలను సృష్టిస్తోంది. సంచలనాలకు మారు పేరుగా మారిన బిగ్ బాస్ కార్యక్రమం కలకలం రేపుతుంది . తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న ఓ నటి ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం రేపుతుంది . ఈ ఘటనతో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న నటీనటులు కార్యక్రమ వ్యాఖ్యాత కూడా కంగారు పడిపోయారు . ప్రతి ఏడాదీ బిగ్ బాస్ ఏ భాషలో మొదలైనా ముగిసే వరకూ వివాదాలు జరుగుతూనే ఉంటాయి .


తమిళ బిగ్ బాస్ షో ప్రారంభం నుంచీ వివాదాలతో నడుస్తుంది. కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది . తాజాగ తమిళ బిగ్ బాస్ హౌస్ లో హాస్యనటి మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది . తమిళంలో ఓరుకల్లూరు కందాడి చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్నారు. యాభై రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మధుమిత ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .


శనివారం అనుకోకుండా ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది . దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు . బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ గా మారిన తరువాత హౌస్ లో ఉన్న సహచరుల నుంచి తనకు సహకారం అందకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత తెలిపారు . హౌస్ లో సహచరుల నుంచి ఎదురైన అవమానాలు తట్టుకోలేకపోయానని అందుకే ఆత్మహత్యా యత్నం చేసుకున్నాను అని మధుమిత చెప్పారు .


మరింత సమాచారం తెలుసుకోండి: