మెగాస్టార్ సైరా మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.  ఈ వీడియో బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసింది.  చారిత్రాత్మక కథనంతో తెరకెక్కించడం అంటే మాములు విషయం కాదు.  దానికి ఎంతో ధైర్యం కావాలి.  సమిష్టి కృషి ఉండాలి.  ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ దిశగా పరుగులు తీస్తున్న సైరా.. టీజర్ ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  


ఈ టీజర్ ఈరోజు మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో రిలీజ్ చేస్తున్నారు.  ఐదు భాషల్లో ఒకేసారి టీజర్ రిలీజ్ కాబోతున్నది.  తెలుగు టీజర్ ను మెగాస్టార్ రిలీజ్ చేస్తుంటే.. బాలీవుడ్ టీజర్ ను అమితాబ్, కోలీవుడ్ టీజర్ ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్ ను కిచ్చ సుదీప్ లు రిలీజ్ చేస్తున్నారు.  ఒకేసారి ఐదు భాషల్లో టీజర్ రిలీజ్ కాబోతున్నది.  అయితే, ఈ టీజర్ లో ఏమున్నది.   స్పెషల్ ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  


2018లో ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు.  రిలీజ్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్ అయ్యింది.  మెగాస్టార్ ను స్వాతంత్ర యోధుడిగా చూసి అందరు షాక్ అయ్యారు.  అయితే, సెకండ్ టీజర్ కోసం దాదాపు సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది.  ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ కాబోతున్న ఈ టీజర్ కోసం ముంబై రెడీ అవుతున్నది.  ముంబై వేదికగా సాహో టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.  


మెగాస్టార్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు.  యూనిట్ అంతా ఈ టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ టీజర్లో ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వబోతున్నారో.. పవన్ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ టీజర్ ను బట్టే సినిమా ఎలా ఉంటుందనే అంచనాకు రావొచ్చు.  వచ్చే నెలలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలను వివిధ లొకేషన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: