రామ్ చరణ్ తన సినిమా కెరియర్ ను కొనసాగిస్తూనే అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఆ మధ్యన ఒక ప్రవేట్ విమాన సంస్థలో చరణ్ కీలక భాగస్వామిగా పెద్ద స్థాయిలోనే పెట్టుబడులు పెట్టాడు. ఇది చాలదు అన్నట్లుగా తన కుటుంబ పేరుతో ఒక సోంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన తల్లిని నిర్మాతగా మార్చి చిరంజీవితో భారీ సినిమాలను తీస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ ప్రాజెక్ట్ లో చరణ్ కు 10 శాతం వాటా ఉంది అని వార్తలు రావడం వెనుక ఒక వ్యూహం ఉంది అని అంటున్నారు. వాస్తవానికి ‘సాహో’ ను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ భాగస్వాములకు చరణ్ కు మధ్య సాన్నిహిత్యంతో యూవీ క్రియేషన్స్ గతంలో చరణ్ ‘రంగస్థలం’ మూవీని అదేవిధంగా ‘వినయ విదేయ రామ’ సినిమాలను విడుదల చేసారు.

అయితే ‘వినయ విదేయ రామ’ వల్ల యూవీ సంస్థకు వచ్చిన నష్టాలను చరణ్ కొంత వరకు తన సొంత డబ్బు ఇచ్చి సహాయం చేసాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే ‘సాహో’ బడ్జెట్ పెరిగి పోవడంతో పది శాతం షేర్ చరణ్ కు ఇచ్చి ఈ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ ను కొంత వరకు కవర్ చేసారు అన్న వార్తలు ఉన్నాయి. 

అయితే చరణ్ ను ‘సాహో’ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉన్నట్లు లీకులు ఇవ్వడం వెనుక మరొక వ్యూహం ఉంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ‘సాహో’ మూవీని అత్యధిక రేట్లకు అమ్మడంతో ఈమూవీ ఫలితంలో అనుకోని తేడాలు వస్తే బయ్యర్ల ఒత్తిడి నుండి వ్యూహాత్మకంగా తప్పించుకోవడానికి చరణ్ ద్వారా మెగా కాంపౌండ్ సపోర్ట్ లభిస్తుందనే వ్యూహంతో పాటు చరణ్ భాగస్వామ్యం అన్ని విధాల శ్రేయస్కరం అన్న అభిప్రాయంతో చరణ్ కు ‘సాహో’ వాటా ఇవ్వడమే కాకుండా ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ న్యూస్ ను లీక్ చేసారు అన్న కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: