యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సాహో సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు కొనసాగిస్తుంది. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు.


ఈ సినిమాలో కేవలం 3 పాటలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. ఈ మూడు పాటల్లో కూడా శ్రద్ధా కపూర్ తో 2 సాంగ్స్ ఉండగా ఒకటి స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. నిన్న రిలీజైన జాక్వెలిన్ బ్యాడ్ బోయ్ సాంగ్ చూశారు కదా. బాలీవుడ్ అందాన్ని తెలుగు సినిమా చూసి ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుండి బయటకు వచ్చినట్టు లేరు.  


సాహోలో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ కచ్చితంగా సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. అయితే ఈ సాంగ్ లొకేషన్స్, కొరియోగ్రఫీ అదిరిపోయింది. బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఈ సాంగ్ మేకింగ్ ఉంది. ఈ సాంగ్ కోసం శ్రీలంక బ్యూటీ భారీగానే ఛార్జ్ చేసిందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.  


మొత్తానికి సాహోలో భాగమైన జాక్వెలిన్ సినిమా ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతుంది. నిన్న రిలీజైన రెండు నిమిషాల సాంగ్ లో జాక్వెలిన్ సోయగాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్, జాక్వెలిన్ రచ్చ చేయడం ఖాయమని తెలుస్తుంది. ఇన్ని హంగులున్న సాహో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: