యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల తండ్రి ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పరచుకున్న ఆ రెండు సినిమాలు కూడా, వారి అంచనాలు అందుకోలేక ఘోర పరాజయాలను చవిచూశాయి. ఇక ఆ తరువాత ఇటీవల కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తన కొత్త సినిమా షూటింగ్ ని మొదలెట్టారు బాలకృష్ణ. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్ నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

అయితే ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ పూర్తి అవడంతో, ఆయన హైదరాబాద్ తిరుగుపయనం అయ్యారు. అయితే ఫ్లైట్ లో ఆయన హైదరాబాద్ చేరుకున్న తరువాత, కొందరు అభిమానులు ఎయిర్పోర్ట్ లో బాలకృష్ణను కలిసి సరదాగా సెల్ఫీలు తీసుకోవడంతో ఆయన న్యూ లుక్, ప్రేక్షకుల కంట పడింది. ఫ్రెంచ్ స్టైల్ గడ్డంతో ఎంతో యంగ్ గా కనిపిస్తున్న  బాలకృష్ణ ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఆయన నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆయన ఫ్యాన్స్ విష్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ న్యూ లుక్ లో బాలకృష్ణ బ్లూ కలర్ సూట్ ధరించిన ఒక ఫోటోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఆ సూట్ లో  బాలకృష్ణ ఎంతో స్టయిలిష్ గా ఉన్నారని, ఆయనను చూస్తుంటే ఒకప్పటి బాలకృష్ణ గుర్తుకువస్తున్నారని, ఆయన ఫ్యాన్స్ ఆనందంగా దాన్ని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. 

‘జైసింహా’ తర్వాత బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ  ఒక డాన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని, అందుకోసమే ఈ విధంగా ఎంతో స్టైలిష్ గా తయారయ్యారని టాలీవుడ్ వర్గాల నుండి గుస గుసలు వినిపిస్తున్నాయి.  బాలకృష్ణ  సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరొయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాష్ రాజ్, భూమిక ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందట....!!


మరింత సమాచారం తెలుసుకోండి: