ఇప్పుడు ఆన్ లైన్ లో టికెట్లు కొనుక్కునే వారికి ఏం తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి స్టామినా అంటే.. టికెట్ కోసం వెళ్తే చొక్కాలు చినగకుండా రాని అప్పటి రోజులు.. ఆ తరం ప్రేక్షకులను అడిగితే తెలుస్తుంది.. ఈ కొణిదెల కొదమసింహం స్టామినా ఏంటో.. తన సినిమా రికార్డులతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన కథానాయకుడు చిరంజీవి.  


150 సినిమాల జర్నీలో ఆయన చూడని హిట్లు లేవు.. ఫేజ్ చేయని ఫ్లాపులు లేవు. అయినా సరే 151వ సినిమా మరో కొత్త సినిమాతో ఎవరు టచ్ చేయని కథతో వస్తున్నాడు. చరిత్ర మర్చిపోయిన ఓ సమరయోధుడి గాథతో సైరా నరసింహా రెడ్డి అంటూ సింహంలా గర్జించేందుకు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.       


వయసు 60 ఏళ్లు దాటినా సరే ఇప్పటికి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా కనిపిస్తున్న చిరంజీవి.. సైరా నరసింహా రెడ్డితో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన సైరా టీజర్ చూస్తే చిరు మరోసారి బాక్సాఫీస్ పై చెలరేగడం ఖాయమని అర్ధమవుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా సినిమా టీజర్ తో అంచనాలను మరింత పెంచింది. 


కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సైరా టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ ను మరింత అలరిస్తుంది. సైరా సినిమా తెలుగులో వస్తున్న మరో విజువల్ గ్రాండియర్ సినిమా అని చెప్పొచ్చు. టీజర్ చూస్తేనే ఆ సినిమా భారీ తనం ఏంటో తెలుస్తుంది. మరి అక్టోబర్ 2న సైరా సంచలనానికి మెగా ఫ్యాన్స్ అంతా సాక్ష్యంగా నిలుస్తారని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: