యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిని మ‌రియు కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా న‌టించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా జ‌రుగుతూ వ‌చ్చింది. మొద‌ట్లో ఏ మ్రాతం క్రేజ్ లేని ఈ సినిమాకు టీజర్, ట్రైలర్లు మ‌రియు శ‌ర్వా లుక్స్‌తో అంచనాలను పెంచేశారు. ఈ క్ర‌మంలోనే రిలీజ్‌కు ముందు ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. 


ఈ చిత్రం ఆగ‌ష్టు 15 స్వాతంత్ర దినోత్స‌వం కానుక‌గా విడుద‌ల చేశారు. శ‌ర్వానంద్ `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` అనుకున్న స్టాయికి రీచ్‌ కాక‌పోయినా ఆ త‌ర్వాత రాబోయే `ర‌ణ‌రంగం` సినిమాపై అంచ‌నాలు బాగానే పెరిగాయి. ఈ చిత్రం `ఎవ‌రు` సినిమాతో పోటీ ప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అయితే సినిమా న‌డుస్తుండంగానే ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది. 


అటు `ఎవ‌రు`కు మాత్రం మంచి టాక్‌తో క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతుంది. కానీ `ర‌ణ‌రంగం` మాత్రం మొదటి రోజు క‌లెక్ష‌న్స్ బెట‌ర్ అనిపించుకున్నా రెండో రోజు స్లో అయిపోయాయి. అయితే ఈ చిత్రం ఆదివారం వ‌చ్చే స‌రికి పూర్తిగా డ‌ల్ అయిపోయింది. దీనికి కార‌ణం శ‌ర్వానంద్ అని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మండిప‌డుతున్నారు. సినిమా విడుద‌లైన రెండో రోజు శ‌ర్వా సినిమా క‌థ బ‌లంగా లేదు.. కానీ  స్క్రీన్ ప్లే న‌చ్చ‌డంతో సినిమా చేశాన‌ని ప‌దే ప‌దే చెప్ప‌డంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై మ‌రీ బ్యాడ్ ఒపీనియ‌న్ ప‌డిపోయింద‌ని అంటున్నారు. 


ఈ క్ర‌మంలోనే క‌లెక్ష‌న్ల‌పై ఎఫెక్ట్ ప‌డి సినిమా క‌లెక్ష‌న్స్ స్లో అయిపోయాయి అని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు శ‌ర్వాపై చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. మ‌రియు ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఉండ‌గానే శ‌ర్వానంద్ ఇలా చెప్పడం కరెక్ట్ కాద‌ని ద‌ర్శ‌కులు వాపోతున్నారు. దీంతో ఈ సినిమా ఫ్లాపు దిశ‌గా దూసుకుపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: