నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ,మహనటి సావిత్రి జీవితకధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహనటి లో నటించి తన పేరులోని కీర్తిని అమాంతం పెంచేసుకుని తెలుగులో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.సాక్షాత్తూ సావిత్రే దిగి వచ్చారా అన్నంతగా‘మహానటి’లో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు పొందింది.‘శైలజ’గా తెలుగువారికి పరిచయమైన ఈ అందాల భరిణి‘మహానటి’గా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి,సావిత్రి పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.




ఆ తర్వాత అనతికాలంలోనే మంచి చిత్రాలు చేసి పాపులర్‌ అయ్యారు.ఇక తాజాగా బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందట.అందులో మొదటిది అజయ్ దేవగన్‌ హీరోగా,శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తున్న, మైదాన్‌, అనే సినిమాకు సైన్ చేసిందట.ఇక ఈ సినిమా 1952-1962 నాటి ఇండియన్‌ ఫుట్‌బాల్‌ నేపద్యంలో సాగుతుందని వినికిడి. ఇకపోతే ఈ చిత్రానికి'బధాయిహో'ఫేమ్‌ అమిత్‌శర్మ దర్శకత్వంవహిస్తుండగా.రితేశ్‌ షా మాటలు అందిస్తున్నారట..అచ్చం మహనటి సావిత్రిలా వున్న,కీర్తి మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌,నటి మేనకల కుమార్తె.




2000సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈమె తొలిసినిమా మలయాళ చిత్రం‘పైలట్స్‌’.దీంతోపాటు, అచనేయనెనిక్కిష్టం,‘కుబేరన్’తదితర చిత్రాల్లో,కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు.ఐతే హీరోయిన్‌గా మాత్రం కీర్తి మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన ‘గీతాంజలి’..మాస్‌,ప్రేక్షకుల్ని తన క్లాస్‌ సినిమాలతో అదరగొట్టి వావ్ అనిపించుకున్న కీర్తి సురేశ్‌ డిజైనర్‌గా రాణించాలని అనుకుని,ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశారట. భవిష్యత్తులో సొంతంగా బొటిక్‌ను ప్రారంభిస్తానని అంటున్నారు.మొత్తానికి మహానటి సినిమాతో తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన కీర్తి,కీర్తి సురేష్ కాదని సావిత్రే మళ్లిపుట్టిందని కొందరు అనుకుంటున్నారు.దానికి ఉదహరణగా గుంటూరు వెళ్లినప్పుడు ఓ పెద్దాయన దగ్గరగావచ్చి,మీరు సావిత్రిగారే కదా?అని అడిగారట.‘నేను సావిత్రిగారిని కాదండీ,అలా  నటించాను’ అని చెప్పిన నమ్మలేదట.మహానటి’ ప్రభావం నాపై ఎప్పటికీ ఉంటుందని చెప్పే కీర్తి,టాలీవుడ్ టాస్క్ పూర్తిచేసి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నసందర్భంగా ఆల్‌ది బెస్ట్ చెబుతాం..

మరింత సమాచారం తెలుసుకోండి: