అయ్య బాబోయ్... కమల్ హాసన్ తో ముద్దుకు కాజల్ ఓకే చెప్పేసింది, కొంత కాలం క్రితం వద్దన్న కాజల్ మనసు మార్చుకుని ఓకే చెప్పడంతో ఇది సినిమా వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయినా కమల్ హాసన్ తో నటించడానికి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తారు, ఇక అది వచ్చాకా ఇది చేయను, అది చేయను అని సాకు ఎవరు చెబుతారు చెప్పండి అని అనుకుంటున్నారా.. అదికూడా తప్పే... ఎందుకంటే ఇదే కాజల్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమానే కాజల్ ఇంతకు ముందు నో అందట. ఎందుకంటే డేట్స్ కుదరలేదని, అప్పట్లో అలా చెప్పానని అంటోంది కాజల్. ఇప్పుడు ఒప్పుకుంది, అంటే కాజల్ చేతులన్నీ ఖాలి అయినట్టేనా అంటున్నారు. కారణం ఈ సినిమాలో లెక్కకు మించి రొమాన్స్ సీన్లు ఉన్నాయట. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలకు కొదవలేదట. అంతే కాదు కమల్ హాసన్ కూడా కొత్త దనాన్ని కోరుకుంటున్నాడట, ఈ సినిమాలో ముద్దులు (అదర చుంబనాలు) లెక్కకు మించి ఉన్నాయంటున్నారు. కాజల్ కూడా నో అనకుండా వాటికి ఒప్పేసుకుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: