Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 1:02 am IST

Menu &Sections

Search

నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?

నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' ఫేం శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా.... స‌తీష్ రేగ‌ళ్ళ‌ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'నివాసి'. గాయ‌త్రి ప్రొడ‌క్ష‌న్స్, ద‌త్తాత్రేయా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌‌లో కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్. వ‌ర్మ లు సంయుక్త‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని 23వ తారీఖున విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ...


నివాసీ గురించి...
నివాసీ జ‌ర్నీ బేస్ మూవీ. ఫాద‌ర్ సెంటిమెంట్ ఎమోష‌న‌ల్ డ్రామా. నేను గ‌తంలో న‌టించిన  శ్రీ‌రాముడింట శ్రీ‌కృష్ణుడంట చిత్రంలో కూడా ఎమోష‌న్ చిత్ర‌మే కాక‌పోతే అందులో వేరే ఎమోష‌న్ ఇందులో వేరే ఎమోష‌న్ ఉంటుంది. 


నివాసీ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం...
ఈ చిత్రానికి నివాసీ అనే టైటిల్ పెట్ట‌డానికి ముఖ్య‌కార‌ణం. ఒక ఎన్ ఆర ఐ ఇండియా వ‌చ్చి త‌న మూలాల‌ను వెతుక్కునే ప‌నిలో ఉంటాడు అందువ‌ల్ల ఆ టైటిల్‌ని ఖ‌రారు చేశారు.  త‌న నివాసాన్ని వెతకుంటూ ఉంటాడు కాబ‌ట్టి నివాసి అని వ‌చ్చింది. నా పాత్ర పేరు వివాన్ ఆదిత్య‌. వివాన్ ఆదిత్య‌కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఆదిత్య అంటే స‌న్ ఆఫ్ గాడ్‌. వివాన్ అంటే సంపూర్ణం అని అర్ధం వ‌స్త‌ది. సంపూర్ణ‌మైన జీవితం ఉన్న‌వాడిని వివాన్ అంటారు. అది సినిమాలో చెబుతాం.  ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర పేరుకి ఒక మంచి మీనింగ్ ఉంటుంది. అలా ఉండేలా పెట్టాం. 


మీ పాత్ర ఎలా ఉంటుంది...
ఇందులో నేను ఒక ఎన్ ఆర్ ఐ లాగా క‌నిపిస్తాను.  ఒక తండ్రి త‌న కొడుకుని క‌ష్ట‌మ‌నేది తెలియ‌కుండా ఒక గాజుబొమ్మ‌లాగా పెంచుతాడు. త‌ర్వాత త‌న‌కు జీవిత‌మంటే ఏంటో తెలియాలి అన్న నేప‌థ్యంలో ఇండియాకి తీసుకెళ్ళి కొన్ని కండీష‌న్స్ పెట్టి అక్క‌డ ఉండ‌మ‌ని వ‌దిలేస్తాడు. ఈ నేప‌థ్యంలో క‌థ మొత్తం సాగుతుంది. పూర్వం రాజులక‌థ‌లు ఉంటాయి. ఒక రాజు త‌న కొడుకుకి రాజ్యాన్ని అప్ప‌చెప్ప‌డానికి రాజ్య‌మంతా తిరిగిర‌మ్మంటాడు అప్పుడు ప‌ట్టాభిషేకం చేస్తాడు సేమ్ కాన్సెప్ట్ ఈ క‌థ‌. 


 పిల్ల‌జ‌మిందార్‌, ఎబిసిడి అలా డ‌బ్బు విలువ తెలుసుకోవ‌డ‌మా...
కాదండి... ఆ క‌థ‌లు వేరు ఈ క‌థ వేరు. ఇది ఎక్కువ‌గా ఎమోష‌న్స్ మీద బేస్ అయి ఉన్న క‌థ‌.  కేవ‌లం మూలాలు తెలుసుకునే ప‌ని. నేను పుట్టింది ప‌ల్లెటూరులో కాని పెరిగిందంతా వేరే కంట్రీస్‌లో ఆ మూలం తెలుసుకోవ‌డం  త‌ల్లిదండ్రుల ఎమోష‌న్స్ గురించి ఇదొక‌ ఎమోష‌న‌ల్ డ్రామా . అలా వెళుతూ ఉండ‌గా సాగే జీవితం. అప్పుడు ఎదుర‌య్యే ప్రాబ్ల‌మ్స్ అన్నీ హీరోకి తెలుస్తాయి.  పూర్తిగా ప‌రిపూర్ణ‌మ‌య్యాక అర్ధ‌మ‌వుతుంది.


తండ్రి పాత్ర‌లో ఎవ‌రు న‌టించారు...
 త‌మిళ్ జ‌య్‌ప్ర‌కాష్ నా తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తారు. సుద‌ర్శ‌న్ వ‌చ్చి సినిమా అంతా ఉంటారు. ల‌వ్‌, ఫ్రెండ్‌షిప్‌, సోష‌ల్ స‌ర్వీస్‌, మెసేజ్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి.  


మీ బ్యాక్ గ్రౌండ్ గురించి...
నాకు ప్ర‌త్యేకించి బ్యాక్ గ్రౌండ్ లేదు. నాది కాకినాడ‌లో గొల్ల‌పాలెం అనే ఒక చిన్న ఊరు. సినిమా ఇండ‌స్ట్రీకి శ్రీ‌కృష్ణుడింట శ్రీ‌రాముడంట చిత్రం ద్వారా వ‌చ్చాను. బాల‌య్య‌గారి జ‌య్‌సింహాలో కూడా ఒక క్యారెక్ట‌ర్‌ని చేశాను. ఇందులో మెయిన్ లీడ్ చేస్తున్నా నా త‌ర్వాత చిత్రం అంగుళిక‌, యుగ‌న్ లో న‌టిస్తున్నాను. 


చిత్రంలో మిగ‌తావ‌న్నీ...
హీరోయిన్ వివ్య చేసింది. చాలా మెచ్యూర్డ్ క్యారెక్ట‌ర్ చేసింది. డైరెక్ట‌ర్ స‌తీష్ వేగ‌ళ్ళ కూడా చాలా బాగా తీశారు. ఆయ‌న నేను ఫ్రెండ్స్‌.


మీరు ఎక్కువ‌గా ఏ జోన‌ర్ కంఫ‌ర్ట్ ఫీల‌వుతారు...
 నేను ఎమోష‌న్‌ని బాగా పండించ‌గ‌ల‌ను. నాకు అది బాగా కంఫ‌ర్ట్ జోన‌ర్‌గా అనిపిస్తుంది. నేను గ‌తంలో చేసిన నా పాత్ర‌ల‌న్నీ కూడా ఎక్కువ‌గా ఎమోష‌న్‌కి సంబంధించే  ఉంటాయి. 


యాక్టింగ్‌కి ఇన్‌స్పిరేష‌న్ ఎవ‌రు...
యాక్టింగ్‌కి ఇన్‌స్పిరేష‌న్ అంటే ర‌జ‌నీకాంత్‌గారంటే చాలా ఇష్టం. ఆయ‌న న‌ట‌నంటే ఇష్టం.


ప్ర‌స్తుతం ఉన్న‌వ‌రితో ఎలా పోటీప‌డ‌గ‌ల‌రు...
అనుకోకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నేను ఎన్నుకునే జోన‌ర్స్ అన్నీ చాలా జాగ్ర‌త్త‌గా నీట్‌గా ఎంచుకుంటున్నాను.  నా చిత్రాల‌న్నీ చాలా నీట్‌గా ఉంటాయి అని అనిపించుకోవాల‌న్న‌దే నా ఆశ‌. నేను ప్ర‌స్తుతం యాక్ష‌న్ సినిమాల‌ను చేస్తున్నాను. 


 మీ త‌దుప‌రి చిత్రాలు...
అంగుళిక‌, యుగ‌న్ చిత్రాల్లో న‌టిస్తున్నాను. అంగుళిక‌లో గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉంటాయి. యుగ‌న్ యాక్ష‌న్ మూవీ, తెలుగు, త‌మిళ్ మూవీ. ప్రియ‌మ‌ణి ప‌దినిమిషాలు మాత్ర‌మే ఈ సినిమాలో ఉంటుంది .


హీరోగానే న‌టిస్తారా...
 హీరోగానే కాక నెగిటివ్ షేడ్ పాత్ర‌లు వ‌చ్చినా చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నా కాని అలాంటి నెగిటివ్ షేడ్ రావ‌డంలేదు విల‌న్‌గా చేయ‌డం అంటే చాలా ఇష్టం అని ముగించారు.


నివాసి.. తండ్రీకొడుకుల భావోద్వేగం కథ.. మెప్పిస్తుందా..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాస‌రి కోసం చేసేది క‌ర‌క్టేనా...?
రాయలసీమ లవ్ లో ఆశ్లీలత లేదంట‌?
`ఉల్లాలా ఉల్లాలా`అంటున్న నూరిన్‌
విఠల్ వాడి ప్రేమ‌క‌థ‌కు జగపతిబాబు ప్ర‌మోష‌న్‌
అమితాబ్ పారితోషికం తీసుకోలేద‌ట‌!
గోపీచంద్ తో మిల్కీబ్యూటీ జ‌త‌క‌ట్ట‌నున్నారా...?
41 ఏళ్ల ప్ర‌స్థానం
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'.
'రాగల 24 గంటల్లో'‌‌ స‌త్య‌దేవ్‌, ఇషారెబ్బా ఏం చేయ‌బోతున్నారు...?
ఆస్కార్ లిస్టులో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా
రాజ‌మండ్రికి క‌ళ్యాణ్‌రామ్‌తో మెహ‌రీన్ వెళ్లిందా...?
కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ లో స‌స్పెన్స్ ఏంటంటే...?
నాయకుడిగా నే కాదు...నటుడిగా కూడా కేక పుట్టించిన శివ ప్రసాద్..
నిన్ను తలచి కి మాస్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌
`సంహారిణి` అరుంధ‌తికి పోటీనా...?
సినిమా న‌చ్చ‌క‌పోతే తిట్ట‌మంటున్న ద‌ర్శ‌కుడు
`90 ఎం.ఎల్` దేవ‌దాస్ కొత్త‌గా ఏం చేస్తాడో...?
బ‌తుక‌మ్మ చీర‌ల‌కు భ‌రోసేనా...?
జగన్.. ఈ పరాచక శాఖ ను ప్రక్షాళన చేయ వలసిందే..!?
పెద‌నాన్న‌కి అబ్బాయికి త‌ప్ప‌ని ఇబ్బందులు
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED