మంగళ వారం మధ్యహ్నం "సైరా నరసింహరెడ్డి" హిందీ టీజర్ విడుదల కార్యక్రమం సందర్బంగా ముంబాయి లో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి,రామ్ చరణ్, తమన్నా,కిచ్చ సుధిప్, రవి కిషన్,విజయ్ సేతుపతి,  దర్శకుడు సురేంధర్ రెడ్డి, మరియు ఈ సినిమా హిందీ రైట్స్ తీసుకున్న ఫరాన్ అక్తర్, అనిల్ తడాని లు హజరయ్యరు, చిత్ర యూనిట్ సినిమాకి సంబధించిన ఆసక్తికరమైనా విషయాలను మీడియాకి వెల్లడించారు.


మీరు టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం ఎలా వుంది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఈ విధంగా సమాధానం ఇచ్చారు... ఇండియాకి ఒక్కడే మెగాస్టార్, అది అమితాబ్ బచ్చన్ అని చెబుతూ...తన గురువు పాత్రకు అమతాబ్ బచ్చన్ అయితే బాగుంటుందని సురేంధర్ రెడ్డి చెప్పాడు.వెంటనే అమిత బచ్చన్ జీ కి ఫొన్ చేసి నా డ్రీమ్ ప్రాజెక్టులో ఒక పాత్ర చేయాలని అడిగాను. దానికి అమిత బచ్చన్ చి్రంజీవి నన్ను మీరు ఎప్పుడు ఏమీ అడుగలేదు, మొదటి సారి అడిగారు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు,


దర్శకుడు సురేంధర్ రెడ్డి ని అమిత బచ్చన్ జీ కి కథ చెప్పడానికి పంపించాను. ఆయనకు సినిమా కథ మరియు ఆయన పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నారు. చిరంజీవి సినిమాలో నటించడం మీకు ఎలా అనిపించింది అని రిపోర్టర్ కిచ్చ సుధిప్ ని అడిగిన ప్రశ్నకు  చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను అలాటింది ఆయన డ్రీమ్ ప్రాజెక్టులో పని చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నను, తండ్రి కోసం ఇంత కష్టపడుతున్న చరణ్ చూస్తే ఆనందంగా ఉందని అన్నారు..హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ చిరంజీవి గారి  తో పనిచేయడం నా  డ్రీమ్ అని చెప్పారు. ఈ సినిమా దసర కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: