నందమూరి ఫ్యాన్స్ అంతా బాలకృష్ణ మీద చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.. ఓరకంగా నందమూరి సిని వారసత్వాన్ని తారక్, కళ్యాణ్ రాం వచ్చే వరకు కొనసాగించింది బాలయ్య బాబే. అందుకే నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య తర్వాతే ఎవరైనా అన్న ఫీలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ అభిమానంలో ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది ఉండదులేండి. నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా అందరిని ఆరాధిస్తుంటారు.


తెలుగు పరిశ్రమ మూల స్థంభాల్లో ఒకరైన బాలయ్య బాబు ఈమధ్యనే 100 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో 100వ సినిమా చేసిన బాలయ్య బాబు ఆ తర్వాత తన సినిమాల స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం బాలకృష్ణ 105వ సినిమా చేస్తున్నాడు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. 


బాలకృష్ణ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ మరోసారి బాలకృష్ణ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య స్టైలిష్ లుక్ ప్రమోట్ చేయడమే కాకుండా కోకో కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఏబిసిడి ఎఫ్ఫు.. బాలయ్య బాబు టఫ్ఫు అంటూ కూడా రచ్చ చేస్తున్నారు.


మొత్తానికి బాలకృష్ణ ఫస్ట్ లుక్ పై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జై సింహా తర్వాత బాలకృష్ణ, కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.   




మరింత సమాచారం తెలుసుకోండి: