Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:50 pm IST

Menu &Sections

Search

బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!

బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
బాల‌ల చిత్రాల వెనుక ఇంత క‌థ ఉందా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాల‌ల చిత్రాలు అంటే ఏవి అనేది, అటువంటి చిత్రాలు నిర్మించ‌డం ప్రారంభమైన నాటినుంచి ఈనాటికీ తేల‌ని అంశం. స్ఠూలంగా బాల‌లు చూడ‌గ‌లిగే, చూసి ఆనందించ‌గ‌లిగే చిత్రాలు బాల‌ల చిత్రాలు అనుకుంటే గాని వాటి గురించి కొంతైనా చెప్ప‌లేము.
బాల‌ల‌ను అల‌రించే, వాళ్ళ‌కు ఆస‌క్తిని క‌లిగించే, వాళ్ళ అభివృద్ధికి తోడ్ప‌డే అన్ని చిత్రాలూ బాల‌ల చిత్రాలే అనేది నా అభిప్రాయం. అందులో బాల‌లు న‌టించారా, పెద్ద‌లు న‌టించారా అనేది అవ‌స‌రం లేదు. 


అయితే పిల్ల‌ల‌కు ఏ విష‌యాల గురించి చెప్ప‌వ‌చ్చు- ఏ విష‌యం గురించి చెప్ప‌కూడ‌దు అనేది బాధ్య‌త గ‌ల మాన‌సిక  శాస్త్ర‌వేత్త‌లు నిర్ణ‌యించ‌వ‌ల‌సిన అంశం.
జాన‌ప‌ద చిత్రాలు, కామిక్ చిత్రాలు, ఎడ్వంచ‌ర్ చిత్రాలు బాల‌ల‌ను ఎక్కువ‌గా ఆకర్షించ‌డం అంద‌రూ గ‌మ‌నిస్తున్న విష‌య‌మే. ఒక క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల నిర్మాత బాల‌ల చిత్రం తీయ‌డానికి ముందుకు రావ‌డం అనేది అరుదు. బాల‌ల చిత్రాలు నిర్మించే నిర్మాత‌లు గానీ, ద‌ర్శ‌కులుగానీ, అందుకై క‌థ‌లు వ్రాసే ర‌చ‌యిత‌లుగానీ వారి ప‌సిహృద‌యాల‌లో దూరి ఆ దృష్టితోనే క‌థ‌లు సృష్టించ‌డం, చిత్రాలు నిర్మించ‌డం జ‌ర‌గాలి.


చిన్న‌త‌నంలో  అంద‌రూ సుల‌భంగా ప్ర‌భావిత‌మౌతారు. గ‌నుక ఏ విష‌యాన్నైనా సున్నితంగా ఆలోచించి బాల‌ల పై ఆ స‌న్నివేశం ఎటువంటి ప్ర‌భావం చూపుతుంది అనేది గ‌మ‌నించి నిర్ణ‌యం తీసుకోవాలి. ఆ చిత్రాల‌లో ఉప‌యోగించే భాష బాల‌ల‌కు సుల‌భంగా అర్ధ‌మ‌య్యే రీతిలో వుండాలి. ఛార్లీచాప్లిన్ చిత్రాలు బాల‌ల‌నెంత‌గా ఆక‌ట్టుకుంటాయో మ‌న‌కు తెలుసు.


ప్ర‌పంచంలో చ‌ల‌న చిత్రాల నిర్మాణం ప్రారంభ‌మైన‌పుడే బాల‌ల చిత్రాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కొత్త వింతలు బాల‌ల‌కేగా ముందుగా ఆనందాన్నిచ్చేది. మ‌న దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే 1918లో నిర్మించిన శ్రీ‌కృష్ణ జన్మ అనే చిత్రంలో త‌న కూతురిచే చిన్ని కృష్ణుడి పాత్ర న‌టింప‌జేసి బాల‌ల న‌ట‌న‌కు నాంది ప‌లికారు. పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూగారిచే 1955లో హృద‌య‌నాధ‌కుంజు అధ్య‌క్ష‌త‌లో స్థాపించ‌బ‌డిన బాల‌ల చిత్ర‌స‌మితి బాల‌ల చిత్రాలు నిర్మించేవారికి స‌హ‌కారం, ప్రోత్సాహం అందిస్తూ వున్న‌ది. అంత‌కు ముందు అంటే 1949లో క‌ల‌క‌త్తాకు చెందిన స‌త్యేన్‌బోస్ నిర్మించిన బెంగాలీ చిత్రం ప‌రివ‌ర్త‌న భార‌త‌దేశంలో నిర్మించిన మొద‌టి బాల‌ల చిత్రం.


పై సంస్థ స‌హ‌కారంతో మొట్ట‌మొద‌టి బాల‌ల చిత్రం (జ‌ల‌దీప్‌)ను నిర్మించిన కేదార‌శ‌ర్మ‌కు దేశ విదేశ అవార్డులు కూడా ల‌భించాయి. ఆయ‌న 25పైగా బాల‌ల చిత్రాలు నిర్మించి బాల‌ల చిత్ర నిర్మాణంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. అలాగే తెలుగులో ఇంత‌కుముందు బాల‌ల చిత్రాలుగా పేరుప‌డ‌క‌పోయినా బాల‌ల‌ను అల‌రించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.  అయితే బాల‌ల‌కోసం ప్ర‌త్యేకంగా బాల‌ల చిత్రస‌మితి ద్వారా శ్రీ‌తాతినేని ప్ర‌కాశ‌రావు నిర్మించిన గంగా భ‌వాని 1980లో రాష్ట్ర ప్ర‌భుత్వంచే ద్వితీయ ఉత్త‌మ చిత్రం అవార్డును అందుకుంది. బాల‌ల చిత్రాలు నిర్మించే నిర్మాత‌లు వ్యాపార ధోర‌ణుల‌కు పోకుండా మంచి బాల‌ల  చిత్రం బాల‌ల‌కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌న వంతు స‌హాయాన్ని, స‌హ‌కారాన్ని అందించాలి. అప్పుడే ఉత్త‌మ బాల‌ల చిత్రాలు నిర్మించ‌బ‌డ‌తాయి.


pillala-chitraalu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాస‌రి కోసం చేసేది క‌ర‌క్టేనా...?
రాయలసీమ లవ్ లో ఆశ్లీలత లేదంట‌?
`ఉల్లాలా ఉల్లాలా`అంటున్న నూరిన్‌
విఠల్ వాడి ప్రేమ‌క‌థ‌కు జగపతిబాబు ప్ర‌మోష‌న్‌
అమితాబ్ పారితోషికం తీసుకోలేద‌ట‌!
గోపీచంద్ తో మిల్కీబ్యూటీ జ‌త‌క‌ట్ట‌నున్నారా...?
41 ఏళ్ల ప్ర‌స్థానం
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'.
'రాగల 24 గంటల్లో'‌‌ స‌త్య‌దేవ్‌, ఇషారెబ్బా ఏం చేయ‌బోతున్నారు...?
ఆస్కార్ లిస్టులో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా
రాజ‌మండ్రికి క‌ళ్యాణ్‌రామ్‌తో మెహ‌రీన్ వెళ్లిందా...?
కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ లో స‌స్పెన్స్ ఏంటంటే...?
నాయకుడిగా నే కాదు...నటుడిగా కూడా కేక పుట్టించిన శివ ప్రసాద్..
నిన్ను తలచి కి మాస్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌
`సంహారిణి` అరుంధ‌తికి పోటీనా...?
సినిమా న‌చ్చ‌క‌పోతే తిట్ట‌మంటున్న ద‌ర్శ‌కుడు
`90 ఎం.ఎల్` దేవ‌దాస్ కొత్త‌గా ఏం చేస్తాడో...?
బ‌తుక‌మ్మ చీర‌ల‌కు భ‌రోసేనా...?
జగన్.. ఈ పరాచక శాఖ ను ప్రక్షాళన చేయ వలసిందే..!?
పెద‌నాన్న‌కి అబ్బాయికి త‌ప్ప‌ని ఇబ్బందులు
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
హిందీ సాధ్యం కాదంటున్న త‌లైవా
టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజున‌ జ‌య‌సుధ‌కు మంచి గిఫ్ట్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.